పాల కంటే అధిక కాల్షియం ఈ ఆకులో ఉంటుంది

మనం రోజు వారి తినే కూరగాయల్లో ముఖ్యమైనది మునగకాయ. కానీ మునగకాయకంటే కూడా మునగ ఆకులో ఇంకా ప్రత్యేకమైన పోషక విలువలు ఉంటాయి.మునగాకు ఎంతో ఆరోగ్యకరమైన కూర అని వైద్యులు చెప్తున్నారు.అంతేకాదు దీన్ని ప్రతీరోజు కూడా ఆహారంగా తీసుకోవచ్చు.దీనిలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏమిటంటే పాల నుంచి లభించే క్యాల్షియంకు 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.పెరుగు నుంచి పొందే ప్రోటీన్లకు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.

 Amazing Health Benefits Of Drumstick Leaves Details, Drumstick Leaves, Cancer, C-TeluguStop.com

మునగాకులో ఉండే పొటాషియం అరటిపండ్లలో ఉండే శాతం కంటే 15 రెట్లు అధికంగా ఉంటుంది.మునగాకులో ఎ,సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి.

అమినో యాసిడ్స్‌, మినరల్స్‌ సమృద్ధిగా ఉన్నాయి.బ్లడ్ షుగర్ లేవిల్స్ ని తగ్గించడంలో మునగాకు పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ పొడి రెగ్యులర్ గా తీసుకుంటే 13.5 శాతం షుగర్ లెవిల్స్ తగ్గిస్తాయి.వీటిలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ద్వారా బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచవచ్చు.

Telugu Calcium, Cancer, Drumstick, Milk, Proteins, Telugu, Telugu Tips, Vitamins

క్యాన్సర్ కి మునగాకు మంచి మందు.శరీరంలో ఉండే ట్యూమర్‌ ని ముందుగానే నివారించడంలో ఇది యాంటీ ట్యూమర్‌గానూ ఈ మునగాకు పనిచేస్తుంది.లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా వీటికి ఉందని తాజా పరిశోధనల్లో తేలింది.

గర్భీణులకు, బాలింతలకు మునగాకు రసం ఎంతో మంచిది.వారికి అవసరం అయిన క్యాల్షియం, ఐరన్‌, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube