ప్లీజ్‌ మా పార్టీకి ఓటు వేయండి అంటూ వచ్చే కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో విసిగి పోయారా.. అయితే ఈ 2.ఓ ను ట్రై చేయండి  

The Amazing App For Unwanted Call And Sms Is Dnd 2.o-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి.ఇన్ని రోజులు రోడ్ల మీద ప్రచారం చేసిన నాయకులు ఇక ఓటరు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం ప్రతి ఓటరు వద్ద కూడా మొబైల్‌ ఫోన్స్‌ ఉన్నాయి...

The Amazing App For Unwanted Call And Sms Is Dnd 2.o--The Amazing App For Unwanted Call And SMS Is DND 2.o-

కనుక ఆ మొబైల్స్‌ కు కాల్‌ చేసి వారిని ఓటు అడుగుతున్నారు.ప్రతి అభ్యర్థి కూడా ఇలాగే చేస్తున్న కారణంగా రోజుకు పది నుండి పదిహేను కాల్స్‌ మరియు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి.కొందరు వాటి వల్ల వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేక పోతున్నాం అంటూ ఆగ్రహంతో ఉన్నారు.

అలాంటి కాల్స్‌ను అడ్డుకునేందుకు టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ఒక యాప్‌ ను విడుదల చేసింది.

The Amazing App For Unwanted Call And Sms Is Dnd 2.o--The Amazing App For Unwanted Call And SMS Is DND 2.o-

డూ నాట్‌ డిస్టర్బ్‌(డీఎన్‌డీ 2.ఓ) అంటూ గూగుల్‌ ప్లేస్టోర్‌, ఆపిల్‌ స్టోర్‌ లో లభిస్తున్న ఈ యాప్‌ వల్ల అటువంటి మార్కెటింగ్‌ కాల్స్‌ను అడ్డుకునే అవకాశం ఉంది.ఆ యాప్‌ను మీ మొబైల్స్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మీకు ఈ గొడవ తప్పుతుంది.

మొబైల్‌ లో డీఎన్‌డీ 2.ఓ ను ఇన్‌స్టాల్‌ చేసి మీ ఫోన్‌ నెంబర్‌ను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.అలా రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి మార్కెటింగ్‌ కాల్స్‌ కాని, ఎస్‌ఎంఎస్‌లు కాని రాకుండా ఉంటాయి...

ఈ యాప్‌ను ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఉంచుకుంటే రోడ్డు అన్‌ నోన్‌ నెంబర్‌ల నుండి కాల్స్‌ తప్పుతాయి, మా పార్టీకి ఓటేయండి అంటూ పదే పదే వారు చెప్పే ప్రసంగాలను వినడం తప్పుతుంది.టెలికాం సంస్థల నుండి మార్కెటింగ్‌ కాల్స్‌ ను ఇది అధికారికంగా కాల్స్‌ను బ్యాన్‌ చేస్తుంది.

ఇతర కాల్స్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.బ్యాక్‌ కాల్స్‌ మరియు బ్యాంక్‌ ఎస్‌ఎంఎస్‌లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యాప్‌ చూస్తుంది.వాటిని యధావిధిగా చూసుకోవచ్చు...

మరెందుకు ఆలస్యం వెంటనే మీ ఫోన్‌ను తీసుకుని ప్లేస్టోర్‌ కు వెళ్లి డీఎన్‌డీ 2.ఓను వినియోగించేయండి.ప్రస్తుతం 2.ఓ చిత్రం ఏ స్థాయిలో వసూళ్లను దక్కించుకుంటుందో అలాగే డీఎన్‌డీ 2.ఓ యాప్‌ కూడా అదే స్థాయిలో డౌన్‌లోడ్‌లు జరుగుతున్నాయి.వేలాది మంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

వారంతా కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని ఓటర్ల మీద దాడి చేస్తున్నారు.ఆ దాడిని ఈ 2.ఓ ద్వారా అడ్డుకోవచ్చు...