మూడు పార్టీల కూటమి.. టీడీపీ లో కలవరం !

బీజేపీ, టీడీపీ ( BJP , TDP )మద్య పొత్తుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవుతున్నాయి.బీజేపీతో కలవాలని టీడీపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికి.

 The Alliance Of Three Parties Confusion In Tdp , Tdp, Mp Keshineni Nani, Chandr-TeluguStop.com

కాషాయ పార్టీ మాత్రం దూరంగా జరుగుతూ వచ్చింది.కానీ ప్రస్తుతం బీజేపీ కూడా టీడీపీతో కలిసే ఆలోచన చేస్తోంది.

దీంతో ఈ కలయిక టీడీపీలోని కొందరి నేతలను కలవరనికి గురి చేస్తోందట.టీడీపీతో కలవడానికి జనసేన( Janasena ) సిద్దంగానే ఉంది.

ఇప్పుడు బీజేపీ కూడా రెడీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగితే సీట్ల కేటాయింపులో సర్దుబాటు తప్పక జరగాల్సి ఉంటుంది.

Telugu Ap, Janasena-Politics

ముఖ్యంగా ఈ విషయమే టీడీపీ శ్రేణులను భయపెడుతోందట.ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో పోల్చితే టీడీపీ ప్రభావం అధికంగా ఉంటుంది.అయినప్పటికి కూటమి కారణంగా కొన్ని సమీకరణల దృష్ట్యా సీట్లు త్యాగం చేయక తప్పదు.దాంతో చాలమంది టీడీపీ నేతలలో ఆందోళన మొదలైందట.ఇప్పటికే సీట్ల కేటాయింపులో చంద్రబాబు( Chandrababu ) స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.ప్రజా మద్దతు ఉన్నవారికే సీట్లు అని స్పాష్టం చేశారు.

అలాగే ఈసారి యువతకు అధిక ప్రదాన్యం ఇవ్వబోతున్నట్లు కూడా స్పష్టం చేశారు.దీంతో పార్టీలో సీనియర్స్ గా ఉన్న నేతలు సీటు దక్కుతుందో లేదో అనే ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Ap, Janasena-Politics

ఒకవేళ టీడీపీ నుంచి సీటు దక్కని నేతలు ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేసేందుకు సిద్దమౌతున్నారట.ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Keshineni Nani ) సీటు దక్కకపోతే ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈయన దారిలోనే మరికొంత మంది టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారట.ఇలా నేతలు ఇండిపెండెంట్ లు గా మారితే అధిక నష్టం టీడీపీకే జరిగే అవకాశం ఉంది.

మరోవైపు సీట్ల కేటాయింపులో జనసేన, బీజేపీ పార్టీలకు పెద్దగా తిప్పలేవీ ఉండవుగాని.అసలు చిక్కంతా టీడీపీలోనే.మరి గెలుపు కోసం పొత్తు కోరుకుంటున్న చంద్రబాబు సీట్ల కేటాయింపులో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube