ఓ పిల్లాడి జీవితాన్ని చిత్తు చేసిన మద్యం మత్తు.. !

మద్యం మనిషిలోని విచక్షణను కోల్పోయేలా చేసే మత్తు.ఆరోగ్యాన్ని పాడుచేసే హానికరమైన పానీయం.

 The Alcohol Intoxication Child Life Is Ruined-TeluguStop.com

కానీ ప్రభుత్వాలను బ్రతికంచే ఆయుధం.ఈ మద్యం అనేది లేకుంటే ప్రభుత్వాలు ముందుకు సాగని స్దితి ప్రస్తుతం నెలకొంది.

కానీ ఈ మద్యం మత్తులో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా దీని ప్రవాహం మాత్రం ఆగడం లేదు.ఇకపోతే ఇదే మద్యం మత్తు ఒక బాలుడి ప్రాణాన్ని గాల్లో కలిపేసిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది.

 The Alcohol Intoxication Child Life Is Ruined-ఓ పిల్లాడి జీవితాన్ని చిత్తు చేసిన మద్యం మత్తు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మద్యం మత్తులో స్కార్పియో వాహనం నడపుతున్న ఓ వ్యక్తి వేగంగా వచ్చి తండ్రికి సాయంగా పకోడి బండి వద్ద పనిచేస్తున్న బాలుడిని ఢీకొట్టాడు.దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి గాయాలతో బయటపడ్డాడు.

కాగా ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేయగా అతన్ని వెంబడించిన గ్రామస్తులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని చితకబాదడమే కాదు అతని వాహనాన్ని కూడా ధ్వంసం చేశారట.

ఇక ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట.

#Kirlampudi #Scorpio #Boy Died #Father And Son #Hit The Boy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు