Shara Ali Khan : కారులో దాక్కొని మరీ వెళ్లిన నటి.. కారణం ఏమిటంటే?

సాధారణంగా హీరో హీరోయిన్లు బయట కనిపించారంటే చాలు వారితో సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు అసహనానికి గురవుతూ ఉంటారు.

 The Actress Went Too Far Hiding In The Car What Is The Reason , The Actress , We-TeluguStop.com

అయితే మన తెలుగు సెలబ్రిటీలు పబ్లిక్ లో అంతగా కనిపించకపోయినప్పటికీ బాలీవుడ్ లో సెలబ్రిటీలు మాత్రం తరచుగా బయట కనిపిస్తూ ఉంటారు.మరీ ముఖ్యంగా జిమ్లో వర్కౌట్స్ చేసే బయట కనిపిస్తూ ఫోటోగ్రాఫర్లకు పని చెబుతూ ఉంటారు.

ఇంకా చెప్పాలి అంటే సెలబ్రిటీలను క్యాప్చర్ చేయడం కోసం ప్రత్యేకించి పలువురు ఫోటోగ్రాఫర్స్ జిమ్ సెంటర్స్ దగ్గరే ఉంటారు.అనడంలో ఎటువంటి సందేహం లేదు.

దాంతో సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతూ ఉంటాయి.

కొన్ని కొన్ని సార్లు ఫ్యాన్స్ అలాగే ఫోటోగ్రాఫర్స్ విషయంలో సెలబ్రిటీలు ఇబ్బంది పడుతూ ఉంటారు.

తాజాగా బాలీవుడ్ కి చెందిన సార అలీ ఖాన్ విషయంలో కూడా అదే జరిగినట్టుగా తెలుస్తోంది.సారా అలీ ఖాన్ జిమ్ లో వర్కౌట్ చేసి బయటకు రాగానే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కారులోకి ఎక్కేసింది.

అయితే కారులోకి ఎక్కిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ కంటే పడకుండా కారులో దాక్కుండిపోయింది సారా అలీ ఖాన్.సారా అలీ ఖాన్ ఆ విధంగా ఎందుకు దాక్కుండిపోయింది అన్నది ఒక క్షణం అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ కి అర్థం కాలేదు.

అయినప్పటికీ ఫోటోగ్రాఫర్స్ సారా అలీ ఖాన్ కి సంబంధించిన ఫోటోలను తీశారు.

Telugu Bollywood, Sara Ali Khan, Actress, Car-Movie

కాగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలలో సారా అలీ ఖాన్ కెమెరాల కంటపడకుండా కారులో తన ముఖం కనిపించకుండా లోపలికి దాక్కుంది.ఇకపోతే సారా అలీ ఖాన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

ఇక ఈమె యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ తో ప్రేమలో మునిగి తేలుతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే ఈ విషయంపై సారా అలీ ఖాన్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube