చిరంజీవి మగాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్.. ఏమైందంటే?

The Actor Babu Mohan Interesting Comments About Chiranjeevi

ఒకవైపు సినిమాల్లో మరోవైపు పాలిటిక్స్ లో సత్తా చాటిన అతికొద్ది మంది నటులలో బాబు మోహన్ కూడా ఒకరు.కొన్నేళ్ల క్రితం వరకు సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న బాబు మోహన్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా ఇంటర్వ్యూల ద్వారా వేర్వేరు విషయాల గురించి స్పందిస్తున్నారు.

 The Actor Babu Mohan Interesting Comments About Chiranjeevi-TeluguStop.com

తాను వరంగల్ జిల్లాలో పుట్టానని ఖమ్మంలో పెరిగానని బాబు మోహన్ వెల్లడించారు.డిగ్రీ వరకు ఖమ్మంలో చదివానని బాబు మోహన్ అన్నారు.

తాను మూడో తరగతి చదువుతున్న సమయంలో అమ్మ చనిపోయారని బాబు మోహన్ వెల్లడించారు.అమ్మను తలచుకుని చాలాసార్లు ఏడ్చానని అమ్మంటే ఇష్టం లేని వ్యక్తులు ఎవరూ ఉండరని బాబు మోహన్ అన్నారు.

 The Actor Babu Mohan Interesting Comments About Chiranjeevi-చిరంజీవి మగాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తను ఏడుస్తూ ఉండటంతో కొంతమంది స్నేహితులు ఇంకా ఏడిపించేవారని బాబు మోహన్ వెల్లడించారు.స్కూల్ లో అమ్మ గురించి ఒకరు తప్పుగా కామెంట్ చేయడంతో ఆ అబ్బాయిని తాను బాగా కొట్టానని బాబు మోహన్ పేర్కొన్నారు.

ఆ తర్వాత నా జోలికి ఎవరూ రాలేదని బాబు మోహన్ అన్నారు.కొడుకు చనిపోవడం తీరని లోటు అని బాబు మోహన్ వెల్లడించారు.

Telugu Babu Mohan, Bhanupriya, Chiranjeevi, Radha, Radhika-Movie

నా జీవితంలో, కోట శ్రీనివాసరావు జీవితంలో కడుపు కోత మిగిలిందని బాబు మోహన్ వెల్లడించారు.ఎంతోమందిని నవ్వించే మాకు దేవుడు విధించిన శిక్ష ఇది అని బాబు మోహన్ అన్నారు.కాయలు ఉండే చెట్టుపైనే రాళ్లు పడతాయని బాబు మోహన్ అన్నారు.

Telugu Babu Mohan, Bhanupriya, Chiranjeevi, Radha, Radhika-Movie

చిరంజీవి మగాడు అని రబ్బర్ అని డ్యాన్స్ విషయంలో మెలికలు తిరుగుతూ అద్భుతంగా చేస్తాడని బాబు మోహన్ అన్నారు.చిరంజీవి రాధ, చిరంజీవి భానుప్రియ, చిరంజీవి విజయశాంతి, చిరంజీవి రాధిక కాంబినేషన్ లో వచ్చిన పాటలు నువ్వా? నేనా? అనేలా ఉండేవని బాబు మోహన్ కామెంట్లు చేశారు.మిగతా హీరోలు డ్యాన్స్ చేయరని కాదని అయితే చిరంజీవి డ్యాన్స్ ను చూస్తే తనకు ఒక మగాడు వేస్తున్నాడురా డ్యాన్స్ అనిపిస్తుందని బాబు మోహన్ తెలిపారు.

#Chiranjeevi #Radha #Chiranjeevi #Babu Mohan #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube