ఒకప్పటి ఈ హీరోయిన్ అందుకే పెళ్ళి చేసుకోలేదట…  

Vennira aadai nirmala, telugu senior actress, Telugu veteran actress, Tollywood - Telugu Telugu Senior Actress, Telugu Veteran Actress, Tollywood, Vennira Aadai Nirmala

తెలుగులో పలు చిత్రాలలో తల్లి పాత్రలలో  నటించి ప్రేక్షకుల ఎంతగానో ఆకట్టుకున్న “సీనియర్ నటి నిర్మల” గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈమె పేరు సినిమా పరిశ్రమలోకి రాకముందు శాంతి.

 Thats Why Telugu Senior Actress Vennira Aadai Nirmala Is Still Not Married

కానీ తమిళ ప్రముఖ దర్శకుడు శ్రీ సివి శ్రీధర్ దర్శకత్వం వహించిన  “వెన్నిరాడై” చిత్రంలో నటించగా ఆ చిత్రం మంచి హిట్ అయ్యింది.దీంతో అప్పటి నుంచి వెన్నిరాడై నిర్మల అని అందరూ పిలుస్తున్నారు.

ఇప్పుడు సీనియర్ నటి వెన్నిరాడై నిర్మల గురించి పలు ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.
.

ఒకప్పటి ఈ హీరోయిన్ అందుకే పెళ్ళి చేసుకోలేదట…-Latest News-Telugu Tollywood Photo Image

నటి వెన్నిరాడై నిర్మల తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం ప్రాంతంలో పుట్టి పెరిగింది.నిర్మలకు చిన్నప్పటి నుంచే నాటకాలు మరియు నాట్యంపై ఆసక్తి ఉండటంతో ఆమె తల్లిదండ్రులు భరత నాట్యంలో శిక్షణ కూడా ఇప్పించారు.

దాంతో ఈమె దేశం వ్యాప్తంగా అప్పట్లో పలు నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది.ఇక ఈమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఇప్పటివరకు వెన్నిరాడై నిర్మల పలు కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు.

అయితే ఇందుకు ఎక్కువగా వెన్నిరాడై నిర్మల అప్పట్లో ఓ తమిళ సీనియర్ హీరోని ప్రేమించిందని కానీ ఆ ప్రేమ పెళ్లికి దారి తీయకుండానే పెటాకులైందని అందువల్లే ఇప్పటివరకు నటి వెన్నిరాడై నిర్మల పెళ్లి చేసుకోలేదని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.దీనికి తోడు నటి వెన్నెరాడై నిర్మల కూడా తన వ్యక్తిగత జీవితానికి  సంబందించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆసక్తి చూపక పోవడంతో ఇప్పటివరకు ఈమె ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండి పోయిందో సరైన కారణాలు తెలియడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి వెన్నిరాడై నిర్మల తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, తదితర భాషలలో కలిపి దాదాపుగా రెండు వందలకు పైగా చిత్రాలలో నటించింది.అలాగే తమిళ భాషలో 3 సీరియళ్లలో కూడా నటించింది.

అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎంజీఆర్ పార్టీ కి రాజకీయ పరంగా సేవలు కూడా అందించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thats Why Telugu Senior Actress Vennira Aadai Nirmala Is Still Not Married Related Telugu News,Photos/Pics,Images..