అందుకే రాజమౌళిని తోపు అనేది.. ఈ 3 ఆర్ఆర్ఆర్ సీన్స్ వెనుక ఎంత లోతుందో తెలుసా?

Thats Why Rajamouli Is Great Because Of These Three Rrr Amazing Scenes

రాజమౌళి. ఈ మాటకి పరిచయం అవసరం లేదు.

 Thats Why Rajamouli Is Great Because Of These Three Rrr Amazing Scenes-TeluguStop.com

బాహుబలి తో ఇండియన్ సినిమా హిస్టరీ ని తిరగరాసిన ఘనత జక్కన్నది.ఇక దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఆర్.

ఆర్.ఆర్. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఓ లెవల్ లో ఉన్నాయి.ఇక తాజాగా ఆర్.ఆర్.ఆర్ నుండి జనని వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్.

 Thats Why Rajamouli Is Great Because Of These Three Rrr Amazing Scenes-అందుకే రాజమౌళిని తోపు అనేది.. ఈ 3 ఆర్ఆర్ఆర్ సీన్స్ వెనుక ఎంత లోతుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొత్తం మూడు నిమిషాల తొమ్మిది సెకన్ల నిడివితో ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఇందులో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ లను అద్భుతంగా చూపించాడు జక్కన్న.

ఇక అజయ్ దేవగణ్ కూడా వీరిద్దరితో సమానంగా హైలెట్ అయ్యాడు.“నేను అంటే నా పోరాటం.

నాలో సగం నువ్వు” అని అజయ్ దేవగణ్ శ్రియతో చెప్పిన డైలాగ్ ఈపాటలో హైలెట్ అని చెప్పుకోవచ్చు.

అందుకే ఈ పాటకు ఆర్ఆర్ఆర్ సోల్ అంథెమ్’ ఆర్ఆర్ఆర్ సినిమాకే ఊపిరిపోసిన పాట అని నామకరణం చేశారు.

ఇది భావోద్వేగంతో ఊపేసింది.దేశ భక్తిని ఉప్పొంగించింది.ఇక ఈ సాంగ్ లో అజయ్ దేవ్ గణ్ నుంచి రాంచరణ్, ఎన్టీఆర్, శ్రియా, అలియాభట్.ఇద్దరు చిన్నారుల దాకా నటన అద్భుతమని చెప్పుకోవచ్చు.ఇక షాట్స్ విషయంలో రాజమౌళి గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేము.

బ్రిటీష్ కాల్పులకు పారిపోతూ తమ బిడ్డను కాపాడుకునేందుకు ఇద్దరు యువకులు చనిపోతూ బిడ్డలను విసిరేసిన తీరు కళ్లనీళ్లు తెప్పించక మానదు.ఇక ఇద్దరు చిన్నారులు బ్రిటీషర్ల తుపాకులకు బలి కావడం.ఒకరేమో అద్దంలోంచి దీనంగ హైలెట్ చూపించాడని చెప్పొచ్చు.

ఇలా.ప్రతి సీన్ సాంగ్ లో హైలెట్ అయ్యింది.స్వాతంత్య్ర పోరాట కష్టాలను కళ్లకు కట్టిన ట్టు జక్కన్న చూపించాడని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.మరి.జనని సాంగ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#Rajamouli #Alia Bhatt #Shreya #Janani #Rrr Sole Anthem

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube