గాడ్ ఫాదర్ ప్రమోషన్లకు అందుకే దూరంగా ఉన్నా.. అసలు విషయం చెప్పిన అనసూయ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఏమాత్రం విరామం లేకుండా ఈమె సినిమా షూటింగులతో బిజీగా మారిపోయారు.

 Thats Why I Stayed Away From Godfather Promotions Anasuya Who Said The Real Thin-TeluguStop.com

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా అనసూయ రిపోర్టర్ పాత్రలో నటించారు.ఈమె చేసిన ఈ పాత్రకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.

ఇక ఈ సినిమా విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

సాధారణంగా అనసూయ ఏ సినిమాలలో నటించినా తప్పకుండా ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటారు.

అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎక్కడా కూడా అనసూయ కనిపించలేదు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ నేటిజన్ ఇదే విషయంపై అనసూయను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా నేటిజన్ ప్రశ్నిస్తూ గాడ్ ఫాదర్ సినిమాలో మీ రోల్ ఎంతో అద్భుతంగా నచ్చింది ఇలాంటి మంచి పాత్రలో నటించిన కూడా మీరు ఎందుకు ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అంటూ ప్రశ్నించారు.

Telugu Anasuya, Chiranjeevi, Promotional, Godfather, Mohan Raja, Tollywood-Movie

ఇలా నేటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ. మీరు నమ్మాలి.చాలా సినిమా షూటింగులు ఒకేసారి జరుగుతున్నాయి.

మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె సమాధానం చెప్పారు.దీంతో అనసూయ వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాలేకపోయానని చెప్పకనే చెప్పేసారు.

మొత్తానికి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా అనసూయ మరో అద్భుతమైన పాత్రలో సందడి చేశారని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube