అందుకే దేశం విడిచిపెట్టి వెళ్ళాను : మల్లికా శెరావత్

బోల్డ్ భామ మల్లిక శరావత్‌కు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అభిమానులున్నారు.యంగ్ హీరో అల్లరి నరేశ్‌కు మల్లిక శరావత్ అభిమాని.

 Thats Why I Left India Says Mallika Sherawat-TeluguStop.com

కాగా ఆమెను అల్లరి నరేశ్ ఆరాధిస్తారట.ఇకపోతే మల్లిక శరావత్ హిందీ, తమిళం, చైనీస్, ఇంగ్లిష్ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.

బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న మల్లిక తన కెరీర్ బాగా పీక్స్‌లో ఉన్న క్రమంలోనే విదేశాలకు వెళ్లిపోయింది.అయితే, భారతీయ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది మల్లిక.

 Thats Why I Left India Says Mallika Sherawat-అందుకే దేశం విడిచిపెట్టి వెళ్ళాను : మల్లికా శెరావత్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లాస్ ఏంజిల్స్ దేశ గౌరవ పౌరసత్వాన్ని పొందిన మల్లిక తాజాగా మీడియాతో ఇండియా గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.

మహిళల పట్ల ఇండియన్స్ థింకింగ్ గతంతో పోల్చితే చాలా మారిందని పేర్కొంది.

వెబ్ సిరీస్, సినిమాలను ప్రజెంట్ ప్రజలు బాగా చూస్తున్నారని, బోల్డ్ సీన్స్ సినిమాల్లో ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఇటీవల కాలంలో ఇండియాలో బాగా వస్తున్నాయని, ఇందుకు రైటర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు కనబడుతున్నదని వివరించింది.

ఈ క్రమంలో తన మూవీ కెరీర్ గురించి మల్లిక మాట్లాడింది.

Telugu Actress Mallika Sherawat, Bollywood, Hollywood, Intresting Facts, Left India, Loss Angles, Malli Sharawath Comments, Mallika Sherawat, Rumuors, Web Series-Latest News - Telugu

తన కెరీర్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో వచ్చిన విమర్శలు, రూమర్స్ తనను చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపింది.అందుకే తాను భారత్‌ను విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.ఆనాడు వచ్చిన విమర్శలతో తాను చాలా బాధపడ్డానని, మీడియా తన పట్ల దుర్మార్గపూరితంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేసింది.

Telugu Actress Mallika Sherawat, Bollywood, Hollywood, Intresting Facts, Left India, Loss Angles, Malli Sharawath Comments, Mallika Sherawat, Rumuors, Web Series-Latest News - Telugu

కొన్ని మీడియా సంస్థలు తనకు మద్దతు తెలిపినప్పటికీ మెజారిటీ మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలు రాశాయని చెప్పింది.స్టార్ హీరో జాకీచాన్‌తో నటించిన ఈ భామ ప్రజెంట్ బాలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.వెబ్ సిరీస్ లేదా సినిమా ఏ అవకాశం వచ్చినా నటించేందుకు తాను సిద్ధమేనని తెలిపింది మల్లిక.ఈ సంగతులు ఇలా ఉంచితే మల్లిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.

హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తు ఉంటుంది.

#Malli Sharawath #Angles #India #Web #ActressMallika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు