నా ఫ్రెండ్స్ ఫోటోలు నేను చూపించనిది అందుకే.. వెంకీ డాటర్ రిప్లై అదుర్స్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ బాగా నడుస్తుంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటున్నారు యూజర్ లు.

 Thats Why I Dont Show My Friends Photos Esther Anil Details, Venkatesh,esther An-TeluguStop.com

ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.

అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు.

ఇక సమయం దొరికినప్పుడల్లా ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతూ ఉంటారు.

ఇక ఫాలోవర్స్ కూడా దొరికిందే ఛాన్స్ అన్నట్లు తమలో ఉన్న డౌట్ లన్ని సెలబ్రెటీలను అడుగుతూ ఉంటారు.ఇప్పటికీ ఎంతోమంది నెటిజన్లు సెలబ్రెటీలను వ్యక్తిగత విషయాలు అడుగుతూ సమాధానాలు రప్పించుకున్నారు.

కానీ కొన్ని కొన్ని సమయాలలో సోషల్ మీడియా ద్వారా కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరుగుతుంటాయి.

దాంతో సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం సోషల్ మీడియా ద్వారా కొత్త సమస్యలను మోస్తూ ఉంటారు.

నిజానికి సెలబ్రెటీలపై పుకార్లు క్రియేట్ చేసి వారిని బాగా ఇబ్బంది పెడుతుంటారు.ఇప్పుడు అటువంటి ఇబ్బందిని ఎదుర్కొంది వెంకీ డాటర్.అదేంటి వెంకీ మామ కూతురిని ఎవరు ఏమన్నారు అని అనుకుంటున్నారా.నిజానికి మనం మాట్లాడుకోవాల్సింది వెంకీ సొంత కూతురు కాదు.

వెంకటేష్ సినిమాలో నటించిన వెంకటేష్ కూతురు.

Telugu Drushyam, Esther Anil, Estheranil, Gautami, Johar, Kamal Haasan, Pashanam

గతంలో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఇక అందులో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన బ్యూటీ నే ఎస్తర్ అనిల్. అంతేకాకుండా కమల్ హాసన్, గౌతమి కలిసి నటించిన పాపనాశం సినిమాలో కూడా కమల్ కు చిన్న కూతురుగా నటించింది.

ఇటీవలే దృశ్యం 2 లో కూడా నటించి తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఎస్తర్ ప్రస్తుతం హీరోయిన్ గా అవ్వడానికి తెగ తాపత్రయ పడుతుంది.

ఇప్పటికే టాలీవుడ్ లో జోహార్ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక మరిన్ని అవకాశాల కోసం ఈ అమ్మడు బాగా పోరాటపడుతుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.నిత్యం ఫోటో షూట్ అంటూ బాగా బిజీగా ఉంటుంది.

Telugu Drushyam, Esther Anil, Estheranil, Gautami, Johar, Kamal Haasan, Pashanam

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అతి తక్కువ సమయంలో ఈమె హీరోయిన్ గా అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది ఈ బ్యూటీ.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.ఇక తాజాగా మీడియా వేదికగా ఒక ఫోటో పంచుకుంది.అందులో తనతో పాటు తన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉండగా వారి ఫోటో చూపించకుండా ఫ్లవర్ ఏమోజితో అడ్డుపెట్టింది.

దీంతో తను అలా అడ్డు పెట్టడానికి కారణం నెటిజన్లు అడగటంతో.తను తన ఫ్రెండ్స్ ఫోటోలు పంచడానికి సౌకర్యంగా లేనని ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్లు ఘోరంగా జరిగాయి అని.కొన్ని స్టుపిడ్ యూట్యూబ్ ఛానల్స్ వల్ల తను చాలా ఇబ్బంది పడిందట.వారి ఫోటోలు పెట్టి దారుణమైన కంటెంట్లు ఇచ్చారట.

అందుకే ఆ ఫ్లవర్స్ ఉపయోగించాను అని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube