చికెన్‌ ధరలు ఒక్కసారిగా పెరగడానికి కారణమిదే!

గడచిన కొన్ని నెలలుగా చికెన్ మార్కెట్ సాధారణంగా ఉంది.ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పెరిగాయి.

 That's Why Chicken Prices Are Soaring , Chicken, Delhi-ncr, Mayur Vihar Phase, Yashin‌-TeluguStop.com

చికెన్ ధర దాదాపు 40 శాతం మేరకు పెరిగింది.ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్‌లో 15 రోజుల క్రితం కిలో రూ.180 ఉన్న రిటైల్ చికెన్ ధర ప్రస్తుతం రూ.260కి చేరింది.మరోవైపు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారు కిలోకు రూ.320 నుంచి రూ.340 వరకు చెల్లించాల్సి వస్తోంది.గత 15 రోజులుగా హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు పెరిగాయి.

ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పౌల్ట్రీ వ్యాపారంపై ప్రభావం పడిందని, ఆ ప్రభావం ధరలపైనా కనిపిస్తోందని చెబుతున్నారు.గత రెండు వారాలుగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో చికెన్‌ కొరత కారణంగా దాని ధర పెరుగుతోంది.

 That's Why Chicken Prices Are Soaring , Chicken, Delhi-NCR, Mayur Vihar Phase, Yashin‌-చికెన్‌ ధరలు ఒక్కసారిగా పెరగడానికి కారణమిదే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీని గరిష్ట ప్రభావం ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని రిటైల్ మార్కెట్‌లో కనిపిస్తోంది.మయూర్‌విహార్‌ ఫేజ్‌ 3లో చికెన్‌ విక్రయిస్తున్న యాషిన్‌.రెండు వారాల్లోనే చికెన్ ధర భారీగా పెరిగిందని తెలిపాడు.గతంలో కిలో ధర 180 నుంచి 200 రూపాయల ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉండేది.అయితే మార్కెట్ చార్జీ, ఇతర ఖర్చులతో కలిపి దీని ఖరీదు దాదాపు రూ.200 వరకు రావడంతో ఓపెన్ సెల్లర్లు కిలో రూ.250 నుంచి 260 వరకు విక్రయిస్తూ, కొంతమేర లాభాలు గడిస్తున్నారు.సోమవారం ఢిల్లీలో కిలో చికెన్ ధర రూ.245 నుంచి 270 ఉండగా, ఆన్‌లైన్‌లో చికెన్ ధర రూ.332 నుంచి 357గా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube