మన దగ్గర కరోనా థర్డ్ వేవ్ వచ్చేది అప్పుడే నంట...

కరోనా మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్‌లో వేల మందిని బలి తీసుకున్న సంగతి అందరికీ విదితమే.కాగా, భారత్‌లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని అందరూ అంటున్నారు.

 Thats When The Corona Third Wave Will Come To India, Carona, Third Wave, August-TeluguStop.com

ఈ క్రమంలోనే పరిశోధకులు తాజాగా థర్డ్ వేవ్ గురించి కీలక విషయాలు తెలిపారు.ఇప్పటికే దేశంలో కరోనా కట్టడికి రెండో సారి లాక్ డౌన్ విధించి మళ్లీ కొద్ది రోజుల తర్వాత ఎత్తేశారు.

ఇక న్యూ కొవిడ్ వేరియంట్ డెల్టా ప్లస్ కేసులు కూడా నమోదవుతున్నాయి.వాటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం మనం గమనించొచ్చు.

ఈ క్రమంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, మస్కు ధరించడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈ నెలలోనే అనగా ఆగస్టులోనే కొవిడ్ థర్డ్ వేవ్ అటాకింగ్ చాన్సెస్ ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా పిల్లలపైన ఈ థర్డ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే చాన్సెస్ ఉన్నాయి.ఈ థర్డ్ వేవ్ స్టార్టింగ్ టైంలో రోజుకే లక్ష నుంచి లక్షన్నర కేసులు నమోదు కావచ్చని, ఇక అక్టోబర్ వరకు తీవ్రస్థాయికి కేసులు చేరకుంటాయని అంచనా వేస్తున్నారు.

మన దేశంలో కేరళ, మహారాష్ట్రలో కేసులు నమోదయ్యే క్రమాన్ని పరిశీలిస్తే ఆల్రెడీ థర్డ్ వేవ్‌కు వచ్చేసినట్లు అనిపిస్తున్నదని పరిశోధకులు చెప్తున్నారు.

Telugu Wave, August, Carona, Corona, Kerala, Maharashtra-Latest News - Telugu

థర్డ్ వేవ్ అంచనా వేసేందకు గాను పరిశోధకులు ఫస్ట్, సెకండ్ వేవ్‌ను కంపారిజన్ చేస్తూనే పలు కీలక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు.ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొవిడ్ కేసులలో 50 శాతం కేసులు కేరళలోనివి కావడం గమనార్హం.ఇప్పటికే పలు రాష్ట్రాలను కేంద్రం కొవిడ్ విషయమై హెచ్చరించింది.

న్యూ వేరియంట్స్ వస్తున్న సందర్భంలో ప్రతీ ఒక్కరి పరిస్థితులను అంచనా వేసుకుని రాష్ట్రప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంటే కారణమయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube