బ్యాటింగ్ తర్వాత అశ్విన్ కి అలా జరిగింది... అశ్విన్ భార్య ఎమోషనల్ ట్వీట్  

ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో ఒక యుద్ద వాతావరణాన్ని తలపించిందనే చెప్పవచ్చు.మొదటి టెస్టు నుండే ఆసీస్ క్రికెటర్లు వికృత చేష్టలకు పాల్పడుతూ, స్లెడ్జింగ్ కు పాల్పడుతూ మన భారత ఆటగాళ్లను మానసికంగా క్రుంగ తీయడానికి విశ్వప్రయత్నాలు చేసారు.

TeluguStop.com - Thats What Happened To Ashwin After Batting Ashwins Wifes Emotional

మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ వైఖరిని, ఆటగాడు స్మిత్ వ్యవహరించిన తీరుపై సీనియర్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.మనల్ని దెబ్బ తీయడానికి ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా మన భారత ఆటగాళ్లు కసి తో ఆడి టెస్టును డ్రాగా ముగించారు.

ఈ మ్యాచ్ లో అశ్విన్, హనుమ విహారీ, రిషభ్ పంత్ చూపిన పోరాట పటిమ క్రికెట్ అభిమానులను గర్వపడేలా చేసింది చెప్పవచ్చు.డ్రింక్స్ విరామ సమయంలో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుంటూ కొన్ని గంటల పాటు క్రీజులో నిల్చొని ఆసీస్ రాకెట్ బంతులను ఎదుర్కొంటూ టెస్టును డ్రాగా ముగించారు.

TeluguStop.com - బ్యాటింగ్ తర్వాత అశ్విన్ కి అలా జరిగింది… అశ్విన్ భార్య ఎమోషనల్ ట్వీట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే సుదీర్ఘ బ్యాటింగ్ తరువాత అశ్విన్ విపరీతమైన వెన్ను నొప్పితో బాధపడ్డాడని, నిద్ర లేచిన తరువాత కూడా విపరీతమైన వెన్నునొప్పితో నిటారుగా కూడా నిల్చోలేని విధంగా అయిందని, తన షూ లేస్ ను కట్టుకోలేకపోయాదని క్రికెటర్ అశ్విన్ భార్య ప్రీతి అశ్విన్ ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ చేసింది.ట్వీట్ కు స్పందించిన అశ్విన్ ఇటువంటి కష్ట సమయంలో నాకు సపోర్ట్ గా ఉన్నందుకు కృతజ్ఞతలు అని అశ్విన్ స్పందించాడు.

ఈ ట్వీట్ పై అభిమానులు ఎమోషనల్ గా స్పందిస్తూ సపోర్ట్ గా నిలుస్తున్నారు.

#IndianCricket #Preethi Ashwin #Indian Cricket

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thats What Happened To Ashwin After Batting Ashwins Wifes Emotional Related Telugu News,Photos/Pics,Images..