Pooja Hegde Adivi Sesh : నటి పూజా హెగ్డేతో ముద్దు వద్దనడానికి అదే కారణం.. శేష్ కామెంట్స్ వైరల్!

క్షణం, మేజర్, గూఢచారి వంటి ఎన్నో సినిమాలలో నటించి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్ డిసెంబర్ రెండవ తేదీ హిట్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

 That's The Reason For Not Kissing Actress Pooja Hegde.. Sesh Comments Are Vira-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శేష్ కి యాంకర్ నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

ఈయన గత కొద్దిరోజుల క్రితం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ కార్యక్రమంలో ఏ హీరోయిన్ కి ముద్దు పెట్టకూడదు అనుకున్నారు అంటూ బాలకృష్ణ అడగడంతో పూజ హెగ్డే పేరు చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Adivi Sesh, Balakrishna, Pooja Hegde, Shailesh Kolanu-Movie

ఈ కార్యక్రమంలో భాగంగా మీరు పూజా హెగ్డేకు ఎందుకు ముద్దు పెట్టకూడదనుకున్నారు అంటూ మరోసారి ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ఆ రోజు బాలకృష్ణ గారు అడిగారు ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి తాను పూజా హెగ్డే పేరు చెప్పానని ఈ సందర్భంగా శేష్ వెల్లడించారు.ఇకపోతే ఇప్పటివరకు తాను పూజతో కలిసి నటించలేదు అందుకే ఈ సమాధానం చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది అంటూ శేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube