వాటే లక్.. ఐఫోన్ 13 ఆర్డర్ పెడితే ఐఫోన్ 14 పంపించిన ఫ్లిప్‌కార్ట్..

ఆన్‌లైన్ డెలివరీ కంపెనీల నుంచి ఒక్కోసారి ఒకటి ఆర్డర్ పెడితే మరొకటి డెలివరీ కావడం మనం చూస్తూనే ఉన్నాం.విలువైన వస్తువులు ఆర్డర్ చేస్తే వాటికి బదులుగా సబ్బులు, సెంట్ బాటిల్స్‌, ఇటుక పెల్లలు రావడం లాంటి పొరపాట్లు ఇప్పటికీ చాలానే జరిగాయి.

 That's Luck If You Place An Order For Iphone 13 , Flipkart Sends Iphone 14, Flip-TeluguStop.com

ఇలాంటి పరిస్థితి ఎదురైన వారు చాలా దురదృష్టవంతులనే చెప్పాలి.అయితే ఈ ఈ-కామర్స్ కంపెనీలు చేసే పొరపాట్లు ఒక్కోసారి కొందరిని అదృష్టవంతులుగా మారుస్తాయి తాజాగా ఆ అదృష్టం ఒక వ్యక్తి పట్టింది.రూ.40 వేల విలువైన ఐఫోన్ 13 ఆర్డర్ పెడితే ఈ వ్యక్తికి రూ.80 వేల ఐఫోన్ 14 డెలివరీ అయింది.దీంతో అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

మొన్నీ మధ్యే విడుదలైన ఐఫోన్ 14 చాలా తక్కువ ధరకే తనకి ఈ విధంగా లభించడం చూసి సంతోషపడ్డాడు.

అయితే ఈ విషయం కాస్తా ట్విట్టర్ ప్రకటించడంతో అతని అదృష్టాన్ని చూసి మిగతా నెటిజన్లు కుళ్లుకుంటున్నారు.

ఈ లక్కీ సంఘటన గురించి అశ్విన్ హెగ్డే తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు.ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో తన ఫాలోవర్స్‌లో ఒకరు ఐఫోన్ 13ని ఆర్డర్ చేయగా దానికి బదులుగా లేటెస్ట్ ఐఫోన్ 14 డెలివరీ అయిందని అతను పేర్కొన్నాడు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా యూజర్ ఈ డివైజ్‌ని ఆర్డర్ చేసినట్లు సమాచారం.అయితే దానికి బదులుగా హైకోర్టు పంపించడానికి ఒకే ఒక కారణమని తెలుస్తోంది అదేంటంటే ఐఫోన్ 13, 14 డిజైన్ రెండూ కూడా సేమ్ ఉంటాయి.

దీంతో ప్యాకింగ్ సిబ్బంది దీనికి బదులు దాన్ని ప్యాక్ చేసి ఉండొచ్చు.

అయితే ఈ యూజర్ అనవసరంగా తన అదృష్టానికి ట్విట్టర్ వేదికగా పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు.ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అతని నుంచి కొత్త ఐఫోన్ రిటర్న్ తీసుకునే అవకాశముంది.దీనివల్ల చేతికి చిక్కిన అదృష్టం చేజారిపోయే ఛాన్స్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube