అందుకే ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటారట...

మానవులు, జంతువులు లేదా మరే ఇతురులైన తమ ప్రేమను వ్యక్త పరచడానికి కొంతమంది తమకు ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకుంటుంటారు.అయితే ఇలా పెట్టుకొనే ముద్దు మనుషులేనా కావచ్చు, తమకు ఇష్టమైన వస్తువులయినా కావచ్చు లేదా జంతువులను అయినా కావచ్చు.

 Kissing Moments, Eyes Closing, Health News, Romantic Times,-TeluguStop.com

కానీ మనుషులు ముద్దు పెట్టుకునే సమయంలో వారికే తెలియకుండా కళ్ళు మూసుకుంటారు.అలా ఎందుకు చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం…

తాజాగా ఈ విషయంపై అధ్యయనం చేసినటువంటి కొందరు వైద్య నిపుణులు ఆసక్తికర అంశాలను తెలియజేశారు.

అయితే ఇందులో తమను ప్రేమను వ్యక్తపరిచేందుకు ఒకరినొకరు ముద్దు పెట్టుకునే సమయంలో మానవ శరీరంలోని అతి సున్నితమైనటువంటి శరీర భాగాలలో ఒకటైన పెదవులలో కొంతమేర ఒత్తిడి ఏర్పడుతుందని అందువల్ల మెదడులో పలురకాల న్యూరాన్లు ఉత్పన్నమవుతాయని, ఈ  న్యూరాన్ల కారణంగానే మనకే తెలియకుండా కళ్ళు మూసుకుంటారని వైద్యులు చెబుతున్నారు.అయితే ఇది కేవలం అప్రయత్నంగా జరిగే చర్య మాత్రమేనని, మరికొంతమంది మాత్రం ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకోరని, అలాగే రెండవ లేదా మూడవ సారి ముద్దు పెట్టుకునే వారిలో ఇలాంటి అప్రయత్నచర్యలు చోటుచేసుకోవని కూడా అంటున్నారు.

అయితే తమ ప్రేయసి లేదా భార్యకి తమపై ఉన్నటువంటి గాఢమైన ప్రేమను తెలియజేసేందుకు కొంతమంది పెదాలపై ముద్దు పెట్టుకుంటారని, కానీ తమకు ఇష్టమైన ప్రేయసి లేదా భార్యకి తన తల వెంట్రుక కురులను పక్కకి నిమిరి మెడపై ముద్దు పెట్టుకోవడం వల్ల ఆ ముద్దు తన జీవితాంతం గుర్తు ఉంటుందని అంటున్నారు.అలాగే నుదిటిపై ముద్దు పెట్టుకోవడంతో తమ అనుకున్న వారిపై మరింత నమ్మకం ఏర్పడుతుందని పలు అధ్యయనాల ద్వారా నిరూపితమైంది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube