అందుకే ఈ స్టార్ హీరోయిన్ సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చిందట…  

Nagma, Tollywood veteran actress, UP politics, National Congress party, Telugu heroine - Telugu Nagma, National Congress Party, Telugu Heroine, Tollywood Veteran Actress, Up Politics

తెలుగులో ఒకప్పుడు దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో  మెప్పించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ నగ్మా గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అప్పట్లో తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి పలు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది.

 Thats Is The Reason Tollywood Veteran Actress Nagma Entering Into The Politics

అయితే ఈ మధ్యకాలంలో నటి నగ్మా గురించి పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతు న్నాయి.

అయితే ఇటీవలే ఓ ప్రముఖ పత్రిక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నగ్మా తాను కన్వెర్టడ్  క్రిస్టియన్ అని అలాగే తన తండ్రి హిందువు మరియు తల్లి ముస్లిం అయినందున తనకు అన్ని మతాల పైన గౌరవం ఉందని చెప్పుకొచ్చింది.

అందుకే ఈ స్టార్ హీరోయిన్ సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చిందట…-Latest News-Telugu Tollywood Photo Image

అంతేగాక తనకు సినిమాలపై ఆసక్తి తగ్గిపోయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపింది.దీంతో కొందరు ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుత జనరేషన్ లో నటీనటులు సినిమా జీవితం పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు.

 కానీ ప్రజలకు చేయాలని మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి నగ్మా పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా 2014 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది.

అయినప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ప్రజలకు అందుబాటులో ఉంటుంది.ఇక తన వ్యక్తిగత విషయానికొస్తే తన జీవితంలో కొన్ని ప్రేమాయణాలు విఫలమవడంతో పూర్తిగా పెళ్లి అనే బంధంపై నమ్మకం పోయిందని అందువల్లే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని కూడా పలు సందర్భాలలో నగ్మా చెప్పుకొచ్చింది.

#UP Politics #Nagma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thats Is The Reason Tollywood Veteran Actress Nagma Entering Into The Politics Related Telugu News,Photos/Pics,Images..