వాటే క్రియేటివిటీ.. కూతుర్ని ఫ్లవర్ బొకేగా మార్చేసిన ఉక్రేనియన్ ఇన్‌ఫ్లుయెన్సర్..

ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ఎన్నో క్రియేటివ్ వీడియోలు(Creative videos) వైరల్ అవుతుంటాయి.ఇందులో మదర్స్ కూడా తమ క్రియేటివిటీ చూపిస్తూ ఆశ్చర్య పడుతుంటారు.

తాజాగా అలాంటి ఒక మదర్ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో, ఒక తల్లి తన చిన్న కూతుర్ని ఒక అందమైన ఫ్లవర్ బొకేలా(Beautiful flower bouquet) డెకరేట్ చేసింది.

ఈ తల్లి పేరు ఇరినా ఒనిష్చెంకో, ఆమె ఉక్రెయిన్‌లోని చెర్కాసికి చెందిన ఒక పాపులర్ ఇంటర్నెట్ సెలబ్రిటీ.తన కూతుర్ని ఒక ఫ్లవర్ బొకేలాగా మార్చడం కోసం చాలా క్రియేటివ్‌గా ఆలోచించింది.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు.తల్లి ప్రేమ ఎంతటి అద్భుతమైనది అన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

Advertisement

ఇరినా తన కూతుర్ని చాలా ప్రేమగా అలంకరించింది.కూతుర్ని ఒక అందమైన ఫ్లవర్ బొకేలా తయారు చేయాలని ఆమెకు ఐడియా ఎలా వచ్చిందో కానీ ఇది మాత్రం బాగా క్లిక్ అయింది.

ఒక ఫ్యాషన్ ట్రెండ్‌ను కూడా క్రియేట్ చేసింది.ఇరినా ముందుగా తన కూతురి ఛాతీ చుట్టూ ఒక రకమైన గట్టి టేప్ చుట్టింది.

ఆ తర్వాత, ఆ టేప్ మీద అందమైన పూలను అంటించింది.అలా అలంకరించిన తన కూతుర్ని ఒక ఫ్లవర్ బొకే లాగా ఫోటోలు తీయించింది.

ఉక్రేనియన్ తల్లి (Ukraine mother) తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆ ఫోటోల్లో, ఆమె కూతురు ఒక బ్యూటిఫుల్ బొకే లాగా కనిపిస్తుంది.తల్లి ఆమెను పూలతో అలంకరించడంతోపాటు, పూలగుచ్ఛంలా కనిపించేలా మరికొన్ని అలంకారాలు కూడా చేసింది.

ఒక్క లీటర్ కెమికల్స్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ.. వీడియో చూస్తే షాకే..
పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే.. అక్కడే కొనుగోలు చేశారా?

ఫోటో పోస్ట్ చేస్తూ ఆ తల్లి, "నాకు అత్యంత విలువైన, నేను కోరుకునే బొకే" అని రాసింది.ఈ ఫోటోలు చూసిన చాలా మంది ఆమె కూతురిని చూసి చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.వారు ఆ తల్లీకూతుర్ని ఆశీర్వదించారు.

Advertisement

చాలామంది హార్ట్ ఎమోజీలు, పూల ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు.

తాజా వార్తలు