రేవంత్ కు తొలి ప‌రీక్ష అదే.. అప్పుడే పెరిగిన అంచ‌నాలు...!

ఎన్నో అనుమానాలు, ఎన్నో అంచ‌నాల న‌డుమ టీపీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టారు రేవంత్‌రెడ్డి.అయితే ఆయ‌న ఇలా ప‌గ్గాలు చేపట్ట‌గానే అటు పార్టీ నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డం స్టార్ట్ అయింది.

 That Was The First Test For Rewanth To Get Win In Huzurabad Elections,against Re-TeluguStop.com

ఎంపీ కోమ‌టిరెడ్డి మాత్రం ఏకంగా టీపీసీసీని అమ్ముకున్నార‌ని కామెంట్ చేయ‌డం, కేఎల్ ఆర్‌, మ‌ర్రి చెన్నారెడ్డి లాంటి కీల‌క నేత‌లు రాజీనామాలు చేయ‌డం రేవంత్‌కు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.కాగా ఇదే క్ర‌మంలో రేవంత్‌రెడ్డిక అస‌లు ప‌రీక్ష ముందుంద‌నే చెప్పాలి.

ఇప్పుడు రాష్ట్రాన్ని ఊపేస్తున్న హుజూరాబాద్ ఎన్నిక‌ల పోరులో రేవంత్‌కు తొలిసారి ప‌రీక్ష ఎద‌రుకాబోతోంది.ఆయ‌న హ‌యాంలో తొలిసారి జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌డంతో కాంగ్రెస్‌లోనూ అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

పైగా అక్క‌డ పోటీ చేస్తున్న కౌశిక్‌రెడ్డి రెండో స్థానంలో ఉండటంతో బీజేపీ, టీఆర్ ఎస్ ఓట్లు చీలే అవ‌కాశం మెండుగా ఉన్నాయి.ఒక వేళ ఈ ఎన్నిక‌ల్లో గ‌న‌క కాంగ్రెస్ గెలిచినా లేదా సెకండ్ ప్లేస్‌లో వ‌చ్చినా స‌రే రేవంత్‌కు అది ప్ల‌స్ అవుతుంది.

ఆ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌కు పాజిటివ్ వేవ్ తీసుకొచ్చే అవ‌కాశం ఉంది.మ‌రి దీన్ని రేవంత్ ఎలా ముందుకు తీసుకెళ్తార‌నేదే ఇప్పుడున్న ప్ర‌శ్న‌.

Telugu @ktrtrs, Revanth Reddy, Huzurabad, Koushik Reddy, Telangana-Telugu Politi

ఎందుకంటే కౌశిక్‌రెడ్డి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డికి ద‌గ్గ‌రి బంధువు కావ‌డంతో మ‌రి ఆయ‌న‌కు చెక్ పెట్టే విధంగా రేవంత్ చూస్తారా లేదా త‌న మార్కు క‌నిపించే విధంగా ప‌నిచేస్తారా అన్న‌ది వేచి చూడాల్సిందే.కానీ రేవంత్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత వ‌స్తున్న ఎన్నిక‌లు అత్యంత కీల‌క‌మైన‌వ‌నే చెప్పాలి.ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఎన్నిక‌లు బీజేపీ, టీఆర్ ఎస్ ఉనికిని ప్ర‌శ్నించేవి అయ్యాయి.కానీ ఇప్పుడు రేవంత్ ప్ర‌భావాన్ని ప్ర‌శ్నించే ఎన్నిక‌లు కూడా కాబోతున్నాయి.మ‌రి వీటిని రేవంత్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube