ఆ తెలుగు న్యూస్ ఛానెల్ మూత‌కు ముహూర్త‌మే రెడీ…!  

that top telugu tv news channel will be closed soon,ap,telangana,TV channel,news chaneel,top telugu news channel,closed,full loss, - Telugu Ap, Closed, Full Loss, News Chaneel, Public Talk, Telangana, Top Telugu News Channel, Tv Channel

తెలుగులో న్యూస్ ఛానెల్స్ కోకొల్లులుగా పుట్టుకు వ‌చ్చేశాయి.ఎప్పుడు అయితే యూట్యూబ్ ఛానెల్స్ ప్ర‌భంజ‌నం స్టార్ట్ అయ్యిందో అస‌లే అంతంత మాత్రంగా ఉన్న న్యూస్ ఛానెల్స్ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతూ వ‌స్తోంది.

TeluguStop.com - That Top Telugu Tv News Channel Will Be Closed Soon

ఇక ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛానెల్స్‌లో ఒక‌టి రెండు మిన‌హా అన్ని కూడా ఏపీ, తెలంగాణ‌లో త‌మ‌కు అనుకూలమైన రాజ‌కీయ పార్టీల‌కు బాకాలూదే ఛానెల్స్‌గా మారిపోయాయి.ఈ క్ర‌మంలోనే రాష్ట్ర విభ‌జన జ‌రిగిన‌ప్పుడు ఏపీ బేస్ ఫ‌స్ట్ న్యూస్ ఛానెల్ అంటూ పెద్ద హ‌డావిడితో ప్రారంభ‌మైన ఓ న్యూస్ ఛానెల్ నేడో రేపో మూత ప‌డేందుకు రెడీగా ఉంద‌న్న చ‌ర్చ‌లు మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

స‌ద‌రు న్యూస్ ఛానెల్ ముందుగా ఏపీ ప్ర‌జ‌ల్లో మంచి పేరు తెచ్చుకుంది.ఆ త‌ర్వాత లోప‌భూయిష్ట‌మైన నిర్వ‌హ‌ణ‌తో ఛానెల్ ప్రారంభ‌మైన అన‌తికాలంలోనే డౌన్ ఫాల్స్‌లోకి వెళ్లిపోతూ వ‌చ్చింది.

TeluguStop.com - ఆ తెలుగు న్యూస్ ఛానెల్ మూత‌కు ముహూర్త‌మే రెడీ…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ త‌ర్వాత ఆ ఛానెల్‌ను మ‌రో ఓన‌ర్ టేకోవ‌ర్ చేసినా అతీగ‌తీ లేకుండా పోయింది.ఇక కొత్త సీఈవో వ‌చ్చాక ఆ ఛానెల్లో అస‌లు మీడియా వాతావ‌ర‌ణ‌మే పోయిందంటున్నారు.

కొత్త సీఈవో వ‌చ్చాక అత‌డికి మీడియా వ్య‌వ‌హారాల‌పై ఆస‌క్తి లేక‌పోవ‌డంతో పాటు నియంతృత్వం పెరిగిపోయిందంటున్నారు.

ఇక ఆరు నెల‌లుగా స‌ద‌రు ఛానెల్ సిబ్బందికి జీతాలు లేవంటున్నారు.ప్ర‌తిభావంతులు అయిన జ‌ర్న‌లిస్టులు ఉన్నా.వారిని వాడుకోవ‌డంలో స‌ద‌రు ఛానెల్ ఘోరంగా విఫ‌ల‌మైందంటున్నారు.

ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో స‌ద‌రు ఛానెల్ ఆఫీస్ అద్దె కూడా క‌ట్ట‌క‌పోవ‌డంతో ఆ భ‌వ‌నం య‌జ‌మానులు ఖాళీ చేయాల‌ని వార్నింగ్ ఇచ్చారంటున్నారు.మ‌రోవైపు ఏపీలో కూడా ఆ ఛానెల్ ఆఫీసుల అద్దెలు కూడా క‌ట్ట‌క‌పోవ‌డంతో ఇక్క‌డ కూడా అదే ప‌రిస్థితి ఉందంటున్నారు.

ఏదేమైనా త్వ‌ర‌లోనే ఆ ఛానెల్‌ను పూర్తిగా మూసివేసే ఆలోచ‌న‌లో మేనేజ్‌మెంట్ ఉంద‌ట‌.అదే రూట్లో మ‌రో రెండు ఛానెల్స్ ఉన్నాయంటున్నారు.

ఏదేమైనా రోజు రోజుకు దిగ‌జారిపోతోన్న తెలుగు మీడియా దుస్థితికి ఇవే నిద‌ర్శ‌నాలు.

#TV Channel #Telangana #TopTelugu #Full Loss #Closed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

That Top Telugu Tv News Channel Will Be Closed Soon Related Telugu News,Photos/Pics,Images..