ప‌రిటాల ఫ్యామిలీని వెంటాడుతున్న మ‌ర‌క‌లు.. శ్రీరాంకు అదే ఇబ్బందా..?

అనంత‌పురం జిల్లాలో కీల‌క‌మైన రాజ‌కీయ కుటుంబం ప‌రిటాల ఫ్యామిలీ.ర‌వి నుంచి రాజ‌కీయ ప్ర‌స్థానం ఓ రేంజ్‌లో ఈ కుటుంబం సాగిస్తున్న విష‌యం తెలిసిందే.

 That Stains Following Paritala Family.. Will Sriram Also Facing Same Problem?, P-TeluguStop.com

ఇక‌, ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న భార్య సునీత కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు.రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు కైవ‌సం చేసుకున్నారు.2009లో కేవ‌లం 17 వంద‌ల ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్న సునీత‌.2014లో విజృంభించారు.ఆ ఎన్నిక‌ల్లో 7 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించి.గెలుపు గుర్రం ఎక్కారు.ఈ క్ర‌మంలోనే అప్ప‌టి చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు.

అనేక మంది మ‌ధ్య‌లోనే మంత్రి ప‌ద‌వులు వ‌దులుకున్నా.

సునీత మాత్రం చివ‌రి వ‌ర‌కు కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం.ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో కుమారుడు.

ప‌రిటాల శ్రీరాంను రంగంలోకి దింపారు.ఇక‌, శ్రీరాం నామినేష‌న్ వేసిన ద‌గ్గర నుంచి కూడా ఆయ‌న‌పై చాలా హైప్ క్రియేట్ చేశారు.

భారీ మెజారిటీ ఖాయ‌మ‌ని కొంద‌రు అంటే.రాష్ట్రంలో అత్య‌ధిక మెజారిటీ సాధించే నియోజ‌క‌వ‌ర్గం ఇదేన‌ని కూడా టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేశారు.

పందేలు కూడా కాశారు.అయితే.

చివ‌రాఖ‌రుకు వైసీపీ నాయ‌కుడు తోపుదుర్తి పై దాదాపు పాతిక వేల పైచిలుకు ఓట్ల తేడాతో శ్రీరాం ప‌రాజ‌యం పాల‌య్యారు.

ఇక‌, ఏడాదిన్న‌ర‌గా శ్రీరాం బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

పార్టీలోనూ యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.దీంతో ఇక్క‌డ శ్రీరాం వాయిస్ వినిపించ‌డం లేద‌నేటాక్ బాహాటంగానే వినిపిస్తోంది.

అయితే.ప‌రిటాల సునీత రెండు సార్లు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గంలో.

అభివృద్ధిని ప‌రుగులు పెట్టించిన నియోజ‌క‌వ‌ర్గంలో.త‌న కుమారుడు గెల‌వాల‌ని.

ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ఇక్క‌డ అంద‌రినీ క‌లిసిన సునీత‌.వ్యూహం ఏమైంది? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం.ఏడాదిన్న‌ర త‌ర్వాత ఈ విశ్లేష‌ణ ఏంటా? అనే ఆశ్చ‌ర్యం క‌ల‌గొచ్చు.

కానీ, కొన్నికొన్ని విష‌యాలు వేడిపై తెలియ‌వు.

చాలా నెమ్మ‌దిగా.ఆల‌స్యంగా .తెలుస్తూ ఉంటాయి.అలాంటి విష‌య‌మే ఇప్పుడు ప‌రిటాల శ్రీరాం విష‌యంలోనూ క‌నిపించింది.స్థానికంగా ఉన్న ప్ర‌జ‌లు శ్రీరాం గురించి ఏమ‌నుకుంటున్నార‌ని ఆరా తీస్తే.“మ‌ళ్లీ పాత రోజులు వ‌చ్చే అవ‌కాశం ఉంది!“ అని ఎక్కువ మంది చెప్పడం గ‌మ‌నార్హం.ఇంకొంచెం లోతుగా ప్ర‌శ్నిస్తే.ప‌రిటాల ర‌వి ఉన్న‌ప్పుడు.జిల్లాలో ఎక్కువ‌గా ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతుండేవ‌ని.కార‌ణాలు ఏవైనా.

త‌ప్పు ఎవ‌రిదైనా.తాము అనేక ఇబ్బందులు ప‌డ్డామ‌ని.

ఇక్క‌డి సీనియ‌ర్ సిటిజ‌న్లు చెబుతున్నారు.దీనిని బ‌ట్టి.

శ్రీరాం ఎందుకు ఓడిపోయాడో.అర్ధ‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఆ మ‌ర‌క‌లు పోతాయా?  వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ శ్రీరాం పుంజుకుంటారా?  చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube