రెండేళ్లు ఆ సీరియల్ లో నటించిన అందరూ విసుకునేవాళ్ళే.. నటి అంజనా శ్రీనివాస్

That Serial For Two Years But Everone Is Irritat By Actress Anjana Srinivas

సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారి జీవితం ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు.కొందరికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.

 That Serial For Two Years But Everone Is Irritat By Actress Anjana Srinivas-TeluguStop.com

మరికొందరు అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు.ఈ విధంగా జీవితంలో ఎప్పుడు కలలో కూడా ఊహించని రీతిలో ఆమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు.

అసలు నటన అనే పదాలకు అర్థం కూడా తెలియని ఆమె బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఆమె మరెవరో కాదు మిఠాయి కొట్టు చిట్టెమ్మగా అందరినీ సందడి చేస్తున్న నటి అంజనా శ్రీనివాస్. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 That Serial For Two Years But Everone Is Irritat By Actress Anjana Srinivas-రెండేళ్లు ఆ సీరియల్ లో నటించిన అందరూ విసుకునేవాళ్ళే.. నటి అంజనా శ్రీనివాస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమ కుటుంబంలో ఎవరు ఇలాంటి ఇండస్ట్రీలో లేదని ప్రతి ఒక్కరు ప్రభుత్వ రంగంలో పని చేసే ఉద్యోగులని ఈమె తెలిపారు.తన అమ్మ టీచర్ తన తండ్రి మరో శాఖలో ప్రభుత్వ ఉద్యోగి.

తను కూడా తన తల్లి మాదిరిగా ఒక మంచి టీచర్ కావాలని కలలు కన్నాను తప్ప ఎప్పుడు కూడా ఇలా ఇండస్ట్రీ లోకి రావాలని అనుకోలేదు కానీ ఒక మేకప్ మెన్ తన జీవితాన్ని మార్చాడని ఈ సందర్భంగా అంజనా తెలిపారు.

Telugu Actressanjana, Anjana Srinivas, Goranthadeepam, Irritaed, Serial Actess, Serial Actress, Serialactress, Tollywood-Movie

ఫస్ట్‌ పీయూసీలో ఉండగా… ఓ కాలేజీ ఈవెంట్‌లో మా డ్యాన్స్‌ కార్యక్రమం ఉండడంతో అక్కడ వారిని రెడీ చేయడం కోసం ఒక మేకప్ మెన్ వచ్చారు.ఆయన తనని చూడగానే సీరియల్స్ లో నటిస్తావా అని అడగడంతో సరే అని చెప్పాను.ఇక ఆ మాట అన్న వెంటనే తాను ఒక సీరియల్ ఆడిషన్ జరుగుతుంది వెళ్ళమని చెప్పారు.

అక్కడికి వెళితే వందమందిలో నన్ను ఒక్క దాన్ని ఎంపిక చేశారని ఆ రోజు ఆడిషన్లో ఎంపికవ్వడం ఇప్పటికి నాకు ఎంతో ఆశ్చర్యంగానే ఉందని తెలిపారు.అయితే అప్పటికే నటన పై ఏమాత్రం ఆసక్తి కానీ నటనలో ఓనమాలు కూడా తెలియని నాకు ఈ సీరియల్ లో నటించడానికి కాస్త భయపడ్డానని అంజన తెలిపారు.

Telugu Actressanjana, Anjana Srinivas, Goranthadeepam, Irritaed, Serial Actess, Serial Actress, Serialactress, Tollywood-Movie

ఆ విధంగా 2012లో ‘కృష్ణా రుక్మిణి’ కన్నడ సీరియల్‌తో నటిగా పరిచయమయ్యానని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.ఇలా తాను నటించిన ఈ మొదటి సీరియల్ సూపర్ హిట్ కావడంతో తన వెనక్కి తిరిగి చూసుకోలేదు అని రెండు సంవత్సరాలపాటు ఈ సీరియల్ ఎంతో అద్భుతంగా కొనసాగిందని తెలిపారు.ఇక 2014 వ సంవత్సరంలో తనకు తెలుగులో నటించే అవకాశం వచ్చింది అయితే భాష సమస్య ఉండటం వల్ల మొదట్లో తెలుగులో నటించాలంటే భయపడ్డానని కానీ అదే భయంతో హైదరాబాద్ వచ్చా.రాగానే ఒకే ఒక్క డైలాగ్‌ ఇచ్చారు.

అది కూడా వాళ్లే ప్రామ్టింగ్‌ చేయడంతో ఓకే అనడం అగ్రిమెంట్ అవడం అన్నీ జరిగిపోయాయి.

Telugu Actressanjana, Anjana Srinivas, Goranthadeepam, Irritaed, Serial Actess, Serial Actress, Serialactress, Tollywood-Movie

అలా 2014 సంవత్సరంలో గోరంత దీపంలోని పద్మావతి పాత్రలో నటించానని ఆ పాత్ర తనకు మంచి పేరు సంపాదించిందని తెలిపారు.తన కెరియర్ కన్నడ భాషలో మొదలైనప్పటికీ తాను వరుసగా తెలుగు తమిళ చిత్రాలతో బిజీగా ఉండటంవల్ల నటించలేదని తెలిపారు.అయితే కన్నడ సీరియల్స్ లో నటిస్తున్న రెండు సంవత్సరాల పాటు సెట్ లో ఏ ఒక్కరు కూడా తనని అభినందించిన వారు లేరని, తనకు నటించడం రాదని మాట్లాడుకునేవాళ్ళని అలా ఆ సీరియల్ లో నటించిన రెండు సంవత్సరాల పాటు అందరూ నా నటనతో విసుక్కున్నారని అయితే ఆ విసుక్కోవడం నాకు ఒక గుణపాఠంగా మారి ప్రస్తుతం ఇలా కెరియర్లో ముందుకు సాగుతున్నానని ఈ సందర్భంగా అంజనా శ్రీనివాస్ పేర్కొన్నారు.

#Irritaed #Actess #GoranthaDeepam #Anjana Srinivas #Serial Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube