అక్టోబర్ నుంచి ఆ రూల్..వారికి అలర్ట్

డెబిట్ కార్డు ఉండేవారికి అలర్ట్.అక్టోబర్ నెల నుంచి డెబిట్ కార్డు నిబంధనలు మారనున్నాయి.

 That Rule From October .. Alert Them October, New Rules, Debit Cards, Hdfc, Bank-TeluguStop.com

డెబిట్ కార్డు వాడుతున్నవారికి ఆర్బీఐ ఈ విషయాన్ని తెలియజేసింది.కొన్ని మార్పులు చేస్తూ ప్రకటన జారీ చేసింది.

ఇప్పటి వరకూ కూడా చాలామంది క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు వాడుతుంటారు.వీటిని వాడుతున్నవారికి తమ పవర్, గ్యాస్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, ఇన్సురెన్స్ చెల్లింపులు ఇలా అనేక రకాల సేవలకు ఆటో పేమెంట్ చేసుకుని ఉండటం జరుగుతుంటుంది.

అయితే ఇలా లావాదేవీలు జరిపేవారు ఇకపై అంటే అక్టోబర్ 1వ తేదీ నుండి అలా చేయలేరు.ఈపాటికే బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ సమాచారాన్ని తెలియజేశాయి.

ఆర్బీఐ విడుదల చేసినటువంటి రికరింగ్ పేమెంట్ రూల్స్ ప్రకారంగా చూస్తే మీ కార్డ్స్ పైన స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ద్వారా లావాదేవీలను ఇకపై చేయలేరు.అది ఖాతాదారులకు కుదరదని ఆర్బీఐ తెలియజేసింది.

ఇకపై నేరుగా మర్చంట్‌కే మీ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్లు చేయాలని బ్యాంకులు తమ ఖాతాదారులకు తెలియజేస్తున్నాయి.

Telugu Bank, Debit Cards, Hdfc, Icici, October-Latest News - Telugu

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈపాటికే తమ కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది.మరికొందరికి ఎస్ఎంఎస్ ద్వారా తెలిపింది.ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు తమ ఖాతాదారులకు కూడా ఇదే సమాచారాన్ని అందించాయి.

ఆటో డెబిట్ కార్డ్ పేమెంట్ చేంజెస్ గురించి తమ ఖాతాదారులకు సమాచారం తెలియజేస్తున్నాయి.ఆగస్టు 2019లోనే ఆర్బీఐ ఇటువంటి కొత్త రూల్ ను తెలియజేసింది.డిసెంబర్ 2020లోగా వాటిని అమలు చేయాలని చెప్పినా కరోనా వల్ల ఆ గడువును పొడిగించింది.మార్చి 31, 2021కి ఆ గడువును పెంచింది.

ప్రస్తుతం బ్యాంకుల సంఘం సూచన మేరకు అక్టోబర్ 1, 2021 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఖాతాదారులు ఆలస్యం చేసినట్టైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

అక్టోబర్ నుంచి మారనున్న ఈ నిబంధన మేరకు ఖాతాదారులు తమ లావాదేవీలు జరపాలని ఆర్బీఐ తెలియజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube