వైరల్: ఆ అరుదైన గుర్రం ఇకలేదు..!

ప్రపంచంలోనే అతి పొడవైన,  అరుదైన గుర్రంగా పేరు గాంచిన బిక్ జాక్ అనే 20 ఏళ్ల గుర్రం తాజాగా మృతి చెందింది.2010 లో ఈ అత్యంత అరుదైన గుర్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ అరుదైన గుర్రం బిగ్ జాక్ బెల్జియం జాతికి చెందినదని, అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలోఒక గుర్రపు శాలలో ఇన్ని రోజులు ఉన్నట్లు సమాచారం.ఇన్ని సంవత్సరాల పాటు ఆ గుర్రపు శాల నిర్వాహకులు దాని ఆలనాపాలనా చూడడంతో పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.

 That Rare Horse Is No More World’s Tallest Horse, Big Jake, Died,  Age 20, Vir-TeluguStop.com

ఈ తరుణంలో బిగ్ జాక్ గత రెండు వారాలుగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు బిగ్ యజమాని జెర్రీ గిల్బర్ట్‌ తెలియచేశారు.

యజమాని జెర్రీ గిల్బర్ట్‌ బిక్ జాక్  మరణం పై తీవ్ర విచారణ వ్యక్తం చేయడంతోపాటు, గుర్రపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, బిక్ జాక్ మృతి చెందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, దాని మంచి జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అంతేకాకుండా అరుదైన గుర్రానికి జ్ఞాపకంగా ఇన్ని సంవత్సరాలు అది నివాసం ఉన్న స్టాల్‌ లో ఇక ఏ గుర్రాన్ని ఉంచకుండా ఖాళీగానే ఉంచుతామని కేవలం ఆ స్టాల్‌ గుర్రానికి చెందింది మాత్రమే అని యజమాని జెర్రీ గిల్బర్ట్‌ పేర్కొన్నారు.ఒక ఫలకంపై బిక్ జాక్ బొమ్మ వేయించడంతో పాటు దాని పేరు చెక్కించి స్టాల్ బయట ఏర్పాటు చేస్తామని యజమాని తెలిపారు.

Telugu Age, Big Jake, Latest, Worlds Horse-Latest News - Telugu

ఇక అలాగే యజమాని జెర్రీ గిల్బర్ట్‌ బిక్ జాక్ గురించి తెలియజేస్తూ.అది పుట్టినప్పటినుంచి అరుదైన గుర్రం గా పేరుగాంచిందని, సాధారణంగా బెల్జియం  జాతికి చెందిన గుర్రాలు 45 నుంచి 65 కిలోలు మాత్రమే ఉంటాయని కానీ బిక్ జాక్  మాత్రం  109 కిలోల బరువుతో పుట్టిందని జెర్రీ గిల్బర్ట్‌ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube