ఆ ఒక్క మాట ఉపశమనాన్ని కలిగించింది.. తారకరత్న ఆరోగ్యం పై స్పందించిన చిరు!

That One Word Brought Relief Chiru Reacted To Tarakaratnas Health ,Chiru , Tarakaratna Health , Chiranjeevi,Narayana Hrudayalaya Hospital,bangalore , Nandamuri Tarakaratna,Nara Lokesh

నందమూరి తారకరత్న ఆరోగ్య విషయంపై ప్రతి ఒక్కరు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈయన యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు మద్దతు తెలపడం కోసం కుప్పం వచ్చారు.

 That One Word Brought Relief Chiru Reacted To Tarakaratnas Health ,chiru , Tarak-TeluguStop.com

అయితే పాదయాత్రలో భాగంగా తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ప్రాథమిక చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.అయితే ఈయన గుండెపోటుకు గురయ్యారని తెలియడంతో వెంటనే అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం తనని మెరుగైన చికిత్స కోసం నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

గత మూడు రోజుల నుంచి నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో ప్రత్యేక నిపుణుల సమక్షంలో ఈయనకు చికిత్స జరుగుతుంది.అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉందని తెలియడంతో అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు తారకరత్న ఆరోగ్య విషయంపై కాస్త ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త మేరగవుతుందని ఈయన గుండె స్పందిస్తుందని వైద్యులు ప్రకటించారు.ఇలా ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడంతో చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సోదరుడు తారకరత్న కోలుకుంటున్నారు.ఆయనకు ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని తెలిపారు.ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ తనని ఈ పరిస్థితుల నుంచి కాపాడిన వైద్యులకు, భగవంతుడికి కృతజ్ఞతలు.నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను మై డియర్ తారకరత్న అంటూ చిరంజీవి తారకరత్న విషయంపై స్పందిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube