ఆ రోజు రాత్రి 'బెడ్'పై అరవింద్ స్వామి.. నేలపై రజినీకాంత్.. కారణం ఇదే!

కొందరు అంతే.ఎంత స్టార్ డమ్ వచ్చిన సరే గర్వం చూపించరు.

ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చారు అనేది గుర్తుపెట్టుకుంటారు కాబట్టి.

ఇక అలా ఎంత ఎదిగిన ఒదిగి ఉన్న నటులలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు.

ఒదిగి ఉంటారు అనడానికి అయన జీవితంలో ఎన్నో ఘటనలే ఉదాహరణలు.ఇక అలాంటి ఉదాహరణే అరవింద్ స్వామి, సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.దళపతి సినిమాలో అరవింద్ స్వామి, రజినీకాంత్ కలిసి నటించారు.ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అరవింద్ స్వామికి ఒక రోజు రజినీకాంత్ గదికి వెళ్లారు.

Advertisement

అప్పటికే అందులో ఏసీ ఆన్ చేసి ఉండడం.పరుపు ఎంతో చక్కగా ఉండడంతో పడుకోగానే ఎంతో హాయిగా అనిపించి తెలియకుండానే నిద్రలోకి జరుగుకున్నాడు అరవింద్ స్వామి.

ఇక తెల్లారి లేచి చూసే సరికి రజిని కాంత్ అదే గదిలో నేలమీద పడుకొని కనిపించరు.అయితే అప్పటికి అరవింద్ స్వామి ఇంకా స్టార్ హీరో అవ్వలేదు.

రజినీకాంత్ అప్పటికే సూపర్ స్టార్.దీంతో రజినీకాంత్ ని నేలపైన చుసిన అరవింద్ స్వామికి చమటలు పట్టి బయటకు వెళ్లి అడిగాడు.

బయట ఉన్న వారిని పిలిచి రజిని సార్ నా రూమ్ లో నేలపై పడుకున్నాడు.దీంతో వారు మీరు ఏ రజిని సార్ రూమ్ లో పడుకున్నారు సార్ అంటూ చెప్పారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

మరి లేపొచ్చుగా అని అడిగితే రజిని సార్ లేపొద్దు అన్నారు.నిద్రలో ఉన్న వారిని లేపకూడదు అని అయన చెప్పి కిందే పడుకున్నారు అంటూ ఆఫీస్ బాయ్స్ చెప్పారు.

Advertisement

ఆలా రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నాడు.

తాజా వార్తలు