ఆ ఎమ్మెల్సీ టికెట్ ఎవ‌రికో డిసైడ్ చేసేసిన జ‌గ‌న్‌... క్లారిటీ ఇచ్చేసిన వైసీపీ..!

వైసీపీలో కాక రేపుతున్న ఎమ్మెల్సీ టికెట్ వివాదానికి పార్టీ అధిష్టానం దాదాపు చెక్ పెట్టేసింది.ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టికెట్ నాదే.

 That Mlc Ticket Was Decided By Someone Else ... Ycp Who Gave Clarity, Ap, Ap Pol-TeluguStop.com

ఈ టికెట్ నాకే.అంటూ.

నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డ్డారు.దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి పార్టీలో కోల్డ్ వార్ ప్రారంభ‌మైంది.

కొన్నాళ్ల కింద‌ట‌.టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత అనూహ్యంగా వైసీపీ బాట ప‌ట్టారు.

మూడు రాజ‌ధా నుల‌కు అనుకూలంగా, సీఆర్ డీఏను ర‌ద్దు చేస్తూ.స‌ర్కారు తీసుకువ‌చ్చిన బిల్లుల‌కు మ‌ద్ద‌తుగా ఆమె.టీడీపీకి వ్య‌తిరేకంగా మండ‌లిలో వ్య‌వ‌హ‌రించారు.ఈ క్ర‌మంలోనే టీడీపీకి ఆమె దూర‌మ‌య్యారు.

ఇక‌, ఆ త‌ర్వాత ఆమెపై వేటు వేయాలంటూ.టీడీపీ నుంచి ఒత్తిడి ఎదురైంది.

అయితే.అన‌ర్హ‌త‌ వేటుపై మండ‌లి చైర్మ‌న్ వ‌ద్ద విచార‌ణ పెండింగులో ఉండ‌గానే పోతుల సునీత‌.త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి అధికారికంగా వైసీపీ పంచ‌న చేరిపోయారు.దీంతో పోతుల స్థానం ఖాళీ అయింది.

తాజాగా రెండు రోజుల కింద‌ట ఈ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీచేసింది.దీంతో త‌న సీటును త‌న‌కే ఇవ్వాల‌ని పోతుల సునీత డిమాండ్ చేశారు.

అయితే.స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని రంగంలోకి దింపిన జ‌గ‌న్‌.

ఆమెకు మ‌రో ప‌ద‌విని ఇస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.ప్ర‌తి రెండేళ్ల‌కు మారే.

మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌విని ఆమె ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.దీంతో సునీత మౌనం వ‌హించారు.

Telugu Ap, Jagan, Latest, Mlc Ticket, Tirupathi, Ysrcp-Telugu Political News

మ‌రోవైపు.ఈ ఎమ్మెల్సీ స్థానం అయినా.త‌న‌కు ద‌క్క‌క పోతుందా? అని మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు(గ‌తంలో జ‌గ‌న్ హామీ ఇచ్చిన లేళ్ల అప్పిరెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వంటివారు) ఎదురు చూశారు.అయితే.

వీరెవ‌రికీ కాకుండా.తిరుప‌తి పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా ఉంటూ.

హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ కుటుంబానికి ఈ టికెట్ కేటాయించార‌ని స‌జ్జ‌ల ద్వారా సీనియ‌ర్ల‌కు స‌మాచారం అందింది.ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఇది మంచి ప‌రిణామ‌మ‌ని, త్వ‌ర‌లోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో డాక్ట‌ర్ గురుమూర్తిని బ‌రిలోకి దింపుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంంలో ప్ర‌తిప‌క్షాలు.దుర్గా ప్ర‌సాద్ కుటుంబానికి జ‌గ‌న్ అన్యాయం చేశార‌నే వాద‌న‌‌ను బ‌లంగా వినిపించే అవ‌కాశం ఉంది.దీనిని వ్యూహాత్మ‌కంగా అడ్డుకునేందుకు ప్ర‌స్తుత ఎమ్మెల్సీ టికెట్ ఉప‌యోగ‌ప‌డ‌డంతోపాటు.తాను దుర్గాప్ర‌సాద్ కుటుంబానికి ఇచ్చిన హామీ కూడా నెర‌వేరుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు సీనియ‌ర్లు చెబుతున్నారు.ఏదెలా ఉన్నా.ఎమ్మెల్సీ టికెట్‌పై నెల‌కొన్ని తీవ్ర సందిగ్ధానికి వైసీపీలో ఫుల్ స్టాప్ ప‌డ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube