ఆ మంత్రి కామెంట్లు.‌.. సంచ‌ల‌నం జ‌రుగుతుందా..?  

ఏపీ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు.జ‌రుగుతున్నాయి.

 That Minister Sensational Words On Tdp,tdp,ysrcp,jagan Mohan Reddy,chandra Babu,-TeluguStop.com

మొత్తం ఐదు రోజులు నిర్వ‌హించేందుకు జ‌గ‌న్ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.అయితే.

ప‌ది రోజులైనా జ‌ర‌గ‌నివ్వాల‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని టీడీపీ  కోరింది.ఈ విష‌యంపై అసెంబ్లీ స్పీక‌ర్‌.

ప్ర‌భుత్వానికి ఓ నోట్ పంపించారు.స‌భ‌ను ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌ని ఆయ‌న కూడా కోరారు.

అయితే.దీనికి అంతిమంగా ఐదు రోజులు డిసైడ్ చేసుకున్నారు.

మొత్తం 17 బిల్లుల‌ను కూడా ఆమోదించుకోవాల‌ని అనుకున్నారు.

అయితే.

ఈ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత‌.ఓ మంత్రి నేరుగా మీడియా ముందుకువ‌చ్చారు.

మంత్రి పేర్ని నానిపై జ‌రిగిన హ‌త్యా ప్ర‌య‌త్నానికి సంబంధించిన విష‌యం మాట్లాడారు.అనంత‌రం.

ఓ మీడియా మిత్రుడు.స‌భ‌ను ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌ని అనుకున్నారు? అని ప్ర‌శ్నించారు.దీనికి ఆయ‌న ఐదు రోజులు అని ముక్త‌స‌రిగా స‌మాధానం చెప్పారు.దీంతో ఆ మీడియా మిత్రుడు మ‌ళ్లీ.ప్ర‌తిప‌క్షంటీడీపీ ప‌ది రోజులైనా నిర్వ‌హించాల‌ని.ప్ర‌జా స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయ‌ని.

వాటిపై చ‌ర్చించాల‌ని ప‌ట్టుబ‌డుతోంది క‌దా.? అని అన్నారు.

దీనికి స‌ద‌రు మంత్రి.మైకుకు చేతిని అడ్డం పెట్టి.“స‌భ మొద‌ల‌వ్వ‌నివ్వండి.అప్పుడు టీడీపీ ఏమం టుందో మీరే చూద్దురు.

మూడు రోజులు చాల‌ని ద‌ణ్నం పెట్టేస్తుంది!“ అనేశారు.వెంట‌నే మీడియా మిత్రు డు అలా ఎలా? అని ప్ర‌శ్నించ‌డంతో.అదే స‌స్పెన్స్‌! అంటూ.మంత్రిగారు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.అయితే.దీని వెనుక ఏమైనా.

టీడీపీ నుంచి జంపింగును ప్లాన్ చేశారా? ఒక‌వైపు స‌భ న‌డుస్తున్న క్ర‌మంలోనే టీడీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకునే కార్య‌క్ర‌మం ఏమైనా ప్లాన్ చేశారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

గ‌తంలో క‌ర‌ణం బ‌లరాం ఎలా అయితే.

మ‌ద్ద‌తు దారుగా మారారో.ఇప్పుడు కూడా కొంద‌రు ఎదురు చూస్తున్నార‌ని వైసీపీ నేత‌లే చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇలాంటిదేమైనా ఉందా? అందుకే టీడీపీ మూడు రోజులు చాల‌ని చేతులు ఎత్తుస్తుందా? ఈ వ్యూహాన్ని మ‌న‌సులో పెట్టుకునే మంత్రి వ‌ర్యులు ఇలా సెల‌విచ్చారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube