ప్రాణం కాపాడిన ఆ బుడ్డోడి సమయస్పూర్తి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టెక్నాలజీని కొందరు మంచికి ఉపయోగిస్తుండగా.మరికొందరు చెడుకు ఉపయోగిస్తున్నారు.

 That Kid Who Saved Life Is Full Time The Real Matter Is , Kid Talent, Online Class, Viral Latest, Viral News, Social Media, Mobile Phones , Smart Phones , Dog Life , Kid Kartik ,youtube-TeluguStop.com

ఇటీవల కోవిడ్ రావడంతో విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు వినాల్సి వచ్చింది.అయితే.

, ఆన్ లైన్ క్లాసుల కొరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేశారు.చిన్న వయసులో స్మార్ట్ ఫోన్ చేతిలోకి రావడంతో కొందరు పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ కి అలవాటు పడగా.

 That Kid Who Saved Life Is Full Time The Real Matter Is , Kid Talent, Online Class, Viral Latest, Viral News, Social Media, Mobile Phones , Smart Phones , Dog Life , Kid Kartik ,youtube-ప్రాణం కాపాడిన ఆ బుడ్డోడి సమయస్పూర్తి.. అసలు మ్యాటర్ ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరికొందరు టెక్నాలజీని తెలుసుకునే పనిలో పడ్డారు.మొబైల్ పరిజ్ఙానం ద్వారా ఓ పదేళ్ల పిల్లాడు.

చావు బతుకుల్లో ఉన్న కుక్క ప్రాణాలు కాపాడాడు.దీంతో ఐదో తరగతి చదువుతోన్న కార్తీక్ ను పలువురు అభినందిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్‌కు చెందిన పదేళ్ల బాలుడు కార్తీక్.సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్నాడు.కరోనా దెబ్బకి అందరి స్కూళ్ళలానే ఈ పిల్లాడి స్కూల్ లోనూ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించారు.దీంతో కార్తీక్ చేతికి పదేళ్ల వయసులోనే స్మార్ట్ ఫోన్ అందింది.

అయితే, ఒకవైపు ఆన్ లైన్ పాఠాలు వింటూనే కార్తీక్.మరోవైపు యూట్యూబ్ లో టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నారు.

ఒకరోజు కార్తీక్ తన తండ్రితో కలిసి పొలానికి వెళ్తుండగా.వారికి పక్కనే ఉన్న ఓ బావిలో నుంచి అరుపులు వినిపించాయి.

వెళ్లి చూడగా, ఆ బావిలో ఒక కుక్క పడిపోయి ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ శునకాన్ని వీరు గుర్తించారు.

ఆ శునకాన్ని బావిలో నుండి బయటికి తీయడానికి వీరికి అక్కడ ఎలాంటి అధారం దొరకలేదు.ఆ సమయంలో కార్తీక్.తన తండ్రి దగ్గర స్మార్ట్ ఫోన్ తీసుకుని.ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జంతువులను కాపాడే సంస్థ గురించి గూగుల్ లో సర్చ్ చేశాడు.అందులో కార్తీక్ కు భాగ్యనగరం లోని యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ గురించి తెలిసింది.దీంతో ఆసంస్థ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి కుక్క పరిస్థితి వివరించారు.

అలా వారి సహాయం తీసుకొని ఆ శునకాన్ని కాపాడాడు.దీంతో కార్తీక్ ను పలువురు అభినందిస్తున్నారు.

That Kid Who Saved Life Is Full Time The Real Matter Is , Kid Talent, Online Class, Viral Latest, Viral News, Social Media, Mobile Phones , Smart Phones , Dog Life , Kid Kartik ,youtube - Telugu Dog, Kid Kartik, Kid, Class, Smarth, Latest, Youtube

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube