ఆదర్శం : ఈ స్కూల్‌, పిల్లలు, టీచర్స్‌ అందరి నుండి దేశం చాలా నేర్చుకోవాలి

కేరళలో ఉన్న స్కూల్స్‌లో పిల్లలకు వ్యవసాయంపై అవగాహన కల్పించాలని ప్రభుత్వ నిర్ణయం.కాని చాలా స్కూల్స్‌లో అసలు వ్యవసాయం గురించిన ప్రస్తావనే తీసుకు రారు.

 That Kerala School Kids Enjoying Work In Agriculture-TeluguStop.com

ఎక్కువ శాతం స్కూల్స్‌ వ్యవసాయ పాఠాలను కేవలం క్లాస్‌ల వరకే పరిమితం చేస్తున్నారు.కాని అదే కేరళలోని ఇడుక్కి జిల్లాలోని రాజకుమారి అనే గ్రామంలో స్కూల్‌లో పూర్తిగా వ్యవసాయ క్షేత్రంను ఏర్పాటు చేశారు.

ఆ వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించడంతో పాటు వాటిని స్వయంగా ఆ స్కూల్‌ పిల్లలు మరియు టీచర్లు తింటున్నారు.

Telugu School Teachers, Schoolchildrens, School, Keralaschool-

కేరళ జనాలు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా జనాలు తెలుసుకోవాల్సిన ఈ స్కూల్‌ విషయాలను ప్రత్యేకంగా మీ కోసం అందిస్తున్నాం.దేశంలోని ప్రతి స్కూల్‌ కూడా ఇలా అయితే బాగుంటుంది అనుకుంటారు.కాని స్కూల్స్‌ ఎక్కువగా చదువుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు.

చదువుతో పాటు ఇలాంటి విషయాల్లో కూడా అవగాహణ కల్పించాల్సిన అవసరం ఉంది.మనం తినేది ఏంటీ, అది ఎలా వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది.

అందుకే కేరళలోని రాజకుమారి గ్రామంలో ఉన్న ఆ స్కూల్‌ అందరికి ఆదర్శం.

Telugu School Teachers, Schoolchildrens, School, Keralaschool-

రాజకుమారి గ్రామంలో ఉన్న ఆ స్కూల్‌లో మొత్తం 540 పిల్లలు ఉంటారు.వారికి 23 మంది టీచర్లు ఉంటారు.స్కూల్‌ మరో గంటకు ప్రారంభం అవుతుంది అనగా పిల్లలు అంతా ముందే వచ్చేస్తారు.

మొత్తం అందరు పిల్లలు కూడా తమకు ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు.వారు చేసే పని ఏంటో తెలుసా, కూరగాయల మొక్కలకు నీళ్లు పోడం, చెట్ల వద్ద ఉన్న కలుపు మొక్కలను తోడేయడం, ఇంకా కూరగాయల మొక్కలకు కావాల్సిన పనులు చేయడం రోజువారి పని.

Telugu School Teachers, Schoolchildrens, School, Keralaschool-

ప్రతి రోజు కూడా స్కూల్‌లోని ప్రతి పిల్లాడు కూడా ఆ రెండు ఎకరాల పంట పొలంలో తిరుగుతూ స్వచ్చమైన వాతావరణం అనుభవిస్తూ పనులు చేస్తూ ఉంటారు.పిల్లలకు చాలా ఈజీ పని మరియు ఆసక్తికరంగా ఉండే పనినే టీచర్లు ఇస్తారు.ఇక్కడ వడ్డ నుండి మొదలు పెట్టి ఏకంగా 75 పంటలకు ఎక్కువగానే పండిస్తున్నారట.

Telugu School Teachers, Schoolchildrens, School, Keralaschool-

ఇక్కడ మందులు వాడకుండానే పంటలు పండిస్తారు.వాటినే పిల్లలు మరియు టీచర్లు రోజు తింటున్నారు.మూడు నాలుగు సెంట్లలో వరి వేసి, ఆ వడ్లను బియ్యం చేసి సంవత్సరంలో రెండు లేదా మూడు సార్లు ఆ బియ్యంతో పాయసం చేస్తామని టీచర్లు చెబుతున్నారు.

స్థానికులు కూడా మాకు చాలా హెల్ప్‌ చేస్తారంటూ స్కూల్‌ టీచర్లు చెబుతున్నారు.నిజంగా ఇలాంటి స్కూల్‌లో చదువుకుంటున్నందుకు ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube