వేదం నాగయ్యకి ఫిలిం నగర్ విధుల్లో బిక్షమెత్తుకొనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే..?!

నాగయ్య.ఈయన పేరు చెప్తే చాలా తక్కువ మందే గుర్తుపడతారు.

 That Is Why Veda Nagayya Had To Beg In Film Nagar Dutiesvedam Movie, Tollywood,-TeluguStop.com

అదే వేదం నాగయ్య అని చెప్పండి ఇట్టే గుర్తుపట్టేస్తారు ప్రజలు.వేదం సినిమా అయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

వేదం సినిమాలో సిరిసిల్ల రాములు గా ఆయన నటనకు ఏకంగా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది అంటే ఏ విధంగా నటించి మెప్పించాడో అర్థమవుతుంది.ఈయనది గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఉన్న దేశవరం పేట.సినిమాల్లోకి రాకముందు వ్యవసాయం చేసుకునే వాడు.ఊర్లో పనులు లేకపోవడంతో కొడుకుతో కలిసి హైదరాబాదులో కూలి పనుల కోసం వలస వచ్చాడు.

అలా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓ రోజు అతను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే అతనిని ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు చూసి అతనిని సినిమాలో నటిస్తావా.? అని అడిగితే, ఆయన ఆ తర్వాత వారి ఆఫీస్ కి వెళ్లడంతో నాగయ్య చేతిలో ఓ పెద్ద డైలాగ్ చీటీ పెట్టారు.ఆ డైలాగ్ ను వారి ముందర గుక్కతిప్పుకోకుండా చెప్పడంతో ఆయనకు సినిమాలో అవకాశం లభించింది.దాంతో ఆయనకు వేదం నాగయ్య గా పేరు లభించింది.

Telugu Nagaiah, Nandhi Award, Tollywood, Vedam-Latest News - Telugu

అలా వేదం నాగయ్యకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వేదం సినిమా తర్వాత ఏకంగా 25 సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.ఇందుకు సంబంధించి ఒక్కో సినిమాకు ఆయన క్యారెక్టర్ కు సినిమా రేంజ్ బట్టి మూడు వేల రూపాయల నుండి 25 వేల వరకు రెమ్యూనరేషన్ ను అందుకున్నాడు.అయితే రానురాను ఆయనకు సినిమాలు తగ్గిపోయాయి.పరిస్థితి ఇలా ఉండగా ఆయన భార్య అనారోగ్యంతో చనిపోయింది.దీంతో ఆయన ఇండస్ట్రీకి కొద్ది రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది.ఇండస్ట్రీకి దూరంగా ఉండడంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా రాలేదు.

దీంతో ఆయన కుటుంబం గడవడం కష్టంగా మారడంతో ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఎన్నో సినిమా ఆఫీసులో వెంట తిరిగిన కూడా లాభం లేకపోవడంతో చివరికి కుటుంబ పోషణ కష్టమై ఫిల్మ్ నగర్ లో ఆయన బిక్షాటన చేయడం చేశారు.

ఇందుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు ఆయనపై కార్యక్రమం నిర్వహించగా ఆయన పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించగా, అలాగే మా అసోసియేషన్ కూడా నెలకు 2,500 ఆయనకు అందజేస్తున్నారు.

ఏది ఏమైనా సినిమా రంగంలో అవకాశాలు దొరకడం మాత్రమే కాదు వాడి నిలబెట్టుకోవాలన్న అదృష్టం కలిగి ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube