అందువ‌ల్లే వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయంటున్న‌ మంత్రి గంగుల.. ఫైర్ అవుతున్న నెటిజ‌న్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వ‌ర్షాలు ఓరేంజ్‌లో కురుస్తున్నాయి.ఇప్ప‌టికే ప్ర‌ధాన‌ప‌ట్టణాల‌న్నీ కూడా నీట మునిగాయి.

 That Is Why Minister Gangula Seems To Be On Floods Netizens On Fire, Minister Ga-TeluguStop.com

మ‌రీ ముఖ్యంగా వ‌రంగ‌ల్‌, కరీనంగ‌ర్‌, సిరిసిల్ల‌, నిజ‌మాబాద్ ప‌ట్ట‌ణాలు మొత్తం వ‌ర‌ద‌ల్లోనే ఉన్నాయి.భారీ వర్షాలకు ఈ ప‌ట్ట‌ణాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి ప్ర‌జ‌లునానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

కాగా కరీంనగర్ టౌన్ తోపాటు పరిసర లోతట్టు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన మంత్రి కమలాకర్ కొన్ని ర‌కాల చ‌ర్య‌లు ఇమీడియెట్‌గా చేప‌ట్టేందుకు ఆర్డ‌ర్లు వేశారు.అయితే ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

కాగా తెలంగాణ వ్యాప్తంగా ప‌ట్ట‌ణాల్లో వ‌ర‌ద‌లు రావ‌డానికి టీఆర్ ఎస్ ప్రభుత్వ పాలనే కారణమని చెప్పడం సంచ‌ల‌నం రేపుతోంది.ఆయ‌న ఏమ‌న్నారంటే కేసీఆర్ తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రి కాక ముందు భూమిలో పెద్ద‌గా గ్రౌండ్ వాటర్ లేక‌పోవ‌డం వ‌ల్ల వ‌ర‌ద‌లు పెద్ద‌గా రాలేద‌ని, కానీ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితులు లేవ‌ని, భూగర్భ జలాలు నిండుగా ఉన్నాయ‌ని అందుకే వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయంటూ చెబుతున్నారు.

త‌మ టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, చెరువులు జలాశయాలు నిండు కుండల్లా మారాయ‌న్నారు.

Telugu Floods, Hyderabad, Trs, Projects-Telugu Political News

ఈ కార‌ణంగానే చిన్న వర్షం పడినా కూడా అవ‌న్నీ అలుగులు దుంకి భూమిలోకి వ‌ర‌ద నీరు వెళ్ల‌కుండా ఇలా కాల‌నీళ్లోకి వ‌స్తున్నాయంటూ చెబుతున్నారు.కాబ‌ట్టి ఇలాంటి ప్రకృతి విపత్తుల‌ను ప్రభుత్వం ఆపలేదని చెప్ప‌డంతో షాకింగ్‌కు గురి చేస్తోంది.అయితే ఇక్క‌డే ఆయ‌న కామెంట్లపై నెటిజ‌న్లు భ‌గ్గుమంటున్నారు.

ఇప్పుడు హైదరాబాద్ తో స‌హా చాలా ప‌ట్ట‌ణాల్లో టీఆర్ ఎస్ నాయ‌కులు చెరువులు, నాలాలు కబ్జా చేయ‌డం వ‌ల్లే ఇలా వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయంటూ నెటిజన్లు మండిప‌డుతున్నారు.దాన్ని చెప్ప‌కుండా ఇలా క్రెడిట్ కొట్టేసేందుకు చేస్తారా అంటూ ట్రోలింగ్ న‌డుస్తోంది.

మొత్తానికి మంత్రి గంగ‌ల క్రెడిట్ కోసం చేసిన వ్యాఖ్య‌లు ట్రోలింగ్‌కు దారి తీస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube