కేసీఆర్ అందుకే ఢిల్లీకి వెళ్లాడంటున్న అర‌వింద్‌.. సంచ‌ల‌నం రేపుతున్న వ్యాఖ్య‌లు

మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వారం రోజులు అక్క‌డే మ‌కాం వేసిన సంగ‌తి తెలిసిందే.ఈ పర్యటన సంర్భంగా ఆయ‌న కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు.

 That Is Why Kcr Is Going To Delhi Aravind Sensational Comments-TeluguStop.com

కాగా ఆయాన టూర్ తెలంగాణ రాజకీయవర్గాల్లో పెద్దెత్తున చర్చనీయాంశంగా కొనసాగుతోంది.ఇక ఆయ‌న టూర్ నేప‌థ్యంలో కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఇక టీపీసీసీ చీఫ్ చీప్ రేవంత్ రెడ్డి అయితే బీజేపీ, టీఆర్ ఎస్ ఇక్క‌డ కుస్తీ ప‌డుతున్నా కూడా ఢిల్లీలో మాత్రం దోస్తీ చేస్తున్నాయ‌ని ఆరోపిస్తున్నారు.దీనిపై అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

 That Is Why Kcr Is Going To Delhi Aravind Sensational Comments-కేసీఆర్ అందుకే ఢిల్లీకి వెళ్లాడంటున్న అర‌వింద్‌.. సంచ‌ల‌నం రేపుతున్న వ్యాఖ్య‌లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజ‌కీయాల్లో సంచలనం రేపుతోంది.అంద‌రూ విమ‌ర్శిస్తున్న కేసిఆర్ ఢిల్లీ పర్యటన పొత్తు కోసం కాద‌ని, దాని వెనుక బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయ‌ని చెప్పారు.

రీసెంట్ గా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మినిస్ట‌ర్ కేటిఆర్ కు అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో నోటీసులు పంపింద‌ని, అప్ప‌టి నుంచి కేసీఆర్‌కు నిద్ర ప‌ట్ట‌ట్లేద‌ని చెప్పారు.ఇక త‌న కొడుకును ఎలాగైనా జైలుకు వెల్ల‌కుండా కాపాడుకునేందుకునే కేసిఆర్ ఢిల్లీలో రెండు రోజులకు పైగా ఉన్నారని చెప్పారు.

ఆయ‌న పర్యటన కేటీఆర్ ను కాపాడుకోవ‌డం కోస‌మేనంటూ వివ‌రించారు.

Telugu Amit Sha, Bjp, Bjp Mp Dharmapuri Aravind, Ed Notices, Kcr, Kcr Delhi Tour, Ktr, Mp Aravind, Revanth Reddy, Sensational Comments, Trs, Ts Politics-Telugu Political News

ఇక సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచ‌న దినం సంద‌ర్భంగా నిర్మల్‌లో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేస్తున్న క్ర‌మంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ‌స్తున్నార‌ని, కాగా ఆయ‌న స్పందించే క్ర‌మంలో ఈ అస‌లు విష‌జ్ఞం త‌న‌కు తెలిసిందని ఎంపీ సంచ‌ల‌నం రేపారు.కాగా ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద ఎత్తున బీజేపీలో కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.కేసీఆర్‌ను, కేటీఆర్‌ను జైలుకు పంపిస్తామ‌ని చెబుతున్న బీజేపీ నేత‌లు ఇప్పుడు కేటీఆర్‌ను ఎలా కాపాడుతార‌ని విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

అంటే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం కేటీఆర్‌ను కాపాడుతోందా అనే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి.

#Amit #Kcr Delhi #Revanth Reddy #ED #BjpDharmapuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు