ఈట‌ల‌కు ఆరోగ్య‌శాఖను కేసీఆర్ అందుకే ఇచ్చాడంట‌..!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ న‌డుస్తోంది.ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 That Is Why Kcr Gave The Health Department To Eeta-TeluguStop.com

రోజురోజుకూ స్వ‌రం పెంచుతూ నిప్పులు చెరుగుతున్నారు.ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ఎన్న‌డూ మంత్రుల‌కు కూడా అపాయింట్ ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు.

అలాంటి వ్య‌క్తి కేవ‌లం ఒక సాధార‌ణ వ్య‌క్తి క‌లుస్తానంటే ఎలా అపాయింట్‌మెంట్ ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు.

 That Is Why Kcr Gave The Health Department To Eeta-ఈట‌ల‌కు ఆరోగ్య‌శాఖను కేసీఆర్ అందుకే ఇచ్చాడంట‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హుజూరాబాద్‌లో రీసెంట్‌గా మ‌రోసారి నిర్వ‌హించిన బీజేపీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

అయితే ఈ సంద‌ర్భంగా చాలా వ‌ర‌క సంచ‌ల‌న నిజాలు వెల్ల‌డించారు.కావాల‌నే కేసీఆర్ అప్ప‌ట్లో మూడు నెల‌ల దాకా కేబినెట్ వేయ‌లేద‌ని వ్యాఖ్యానించారు.

త‌న‌కు ఇక మంత్రి ప‌ద‌వి రెండోసారి రాదంటూ కేసీఆరే కావాల‌ని ఆయ‌న పేప‌ర్లో రాయించారంటూ ఆరోపించారు.దీనిపై అప్ప‌ట్లో తాను కూడా తీవ్ర స్థాయిలోనే మండిప‌డ్డ‌ట్టు వివ‌రించారు.

ఇక ఇదే క్ర‌మంలో త‌న‌కు వైద్య ఆరోగ్య శాఖను ఇవ్వ‌డానికి అస‌లు కార‌ణం కూడా వెల్ల‌డించారు ఈట‌ల‌.ఆరోగ్య‌శాఖ అయితే రోజూ త‌న‌పై నెగిటివ్ వార్తలు వ‌స్తాయ‌ని, అలాగే ప్ర‌జ‌ల నుంచి కూడా త‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వస్తాయనే కుట్ర‌తోనే కేసీఆర్ ఆ శాఖ‌ను కేటాయించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.కానీ త‌న ప‌నిత‌న‌మే త‌న‌ను కాపాడింద‌న్నారు.నిజాయితీగా పని చేసే వారికి ఏ రంగంలో అయినా గుర్తింపు ఉంటుంద‌ని వెల్ల‌డించారు.ఇప్పుడు కూడా కావాల‌నే త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉంటున్న వారిని ట్రాన్స‌ఫ‌ర్ చేయిస్తున్నార‌న్నారు.ప్ర‌స్తుతం హుజూరాబాద్‌లో ఓట్ల‌ను గ‌ల్లంతు చేయ‌డానికి టీఆర్ ఎస్ వ‌ర్గాలు కుట్ర చేస్తున్నారని ఇదికేసీఆర్‌కు కొత్తేమీ కాద‌న్నారు.

గ‌తంలో మానుకోట ఉద్య‌మ‌కారుల‌పై దాడులు చేసిన వారిని కేసీఆర్ తన ద‌గ్గ‌ర పెట్టుకున్నారని ఆరోపించారు.ఏదేమైనా ఈట‌ల రాజేంద‌ర్ రోజుకో కొత్త‌ర‌కం నిజాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు.

చూడాలి మ‌రి ముందు ముందు ఇంకెలాంటి నిజాలు బ‌య‌ట పెడుతారో అన్న‌ది.

#Etala Rajendher #Ts Poltics #@CM_KCR #Health Minister #Eetala Rajendar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు