జగన్ కి అందుకే భయం అంటున్న మాజీ మంత్రి యనమల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల చుట్టూ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.పంచాయతీ ఎన్నికలు ఎలాగైనా జరపాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తుండగా మరోపక్క ప్రభుత్వం వాయిదా వేయించే ఆలోచన చేస్తూ ఉంది.

అసలు ఈ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉండగా.ప్రభుత్వాలు ఆలస్యాలు చేస్తూండటంతో మరుగున పడ్డాయి.

Telugu Ys Jagan, Ysrcp-Telugu Political News

ఈ క్రమంలో మార్చిలో కరోనా వైరస్ రాకముందు సరిగ్గా లాక్డౌన్ ముందు వైసిపి ప్రభుత్వం ఎన్నికలకు రెడీ అవగా.ఆ టైంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుపడటం జరిగింది.అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు రెడీ అయిన తరుణంలో కోర్టులు కూడా అనుమతులు ఇవ్వటంతో ప్రభుత్వం ఎలాగైనా పంచాయతీ ఎన్నికలు ఈ టైంలో జరిపించే ఆలోచన లో లేనట్లు తెలుస్తుంది.ఇటువంటి నేపథ్యంలో ఏపీ మాజీ ఆర్థిక మంత్రి టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

హైకోర్టు డివిజన్ బెంచ్  ఆదేశాలను దిక్కరిస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు.నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతారు ఏమో అన్న భయంతో జగన్ రెడ్డి ఉన్నారని సెటైర్లు వేశారు.

అంతే కాకుండా రాజ్యాంగ మరియు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యల పై వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని సూచించారు.జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఫాసిస్ట్ పాలనకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube