అందుకే 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' ప్లాప్ అయ్యిందా...

ఎప్పుడూ విభిన్న కథనాలను ఎంచుకుంటూ, వివాదాలతో సావాసం చేస్తూ మనల్ని అలరించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారుండరు.అయితే ఈ తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”.

 That Is Why Amma Rajyamlo Kadapa Biddalu Is Flop-TeluguStop.com

ఈ చిత్రాన్ని నిన్నటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల నడుమ విడుదల చేసారు. 

Telugu Ammarajyamlo, Chandra Babu, Ramgopal, Rgvamma, Telugu, Ysjagan-Movie

అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను కొంతమేర నిరాశ పరిచిందని చెప్పాలి.దీనికి తోడు  రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒకలాగా ఉంటె చిత్రంలో మరోలా చూపించడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ చిత్రం మొత్తములో ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రను హైలైట్ చేయడంతో మరో వర్గ ప్రజల నుంచి కొంత మేర వ్యతిరేకత ఎదురైనట్లు తెలుస్తోంది.

దీంతో మరి కొందరైతే కేవలం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని హైలైట్ చేయడానికే ఈ ఆర్జీవీ ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. 

అయితే ఇది ఇలా ఉండగా మొదట్లో ఈ చిత్ర ట్రైలర్ తో చిత్రం పై భారీ అంచనాలను అమాంతం పెంచేసింది.

అయితే చిత్రం విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకుల అంచనాలన్నీ తారుమారయ్యాయి.ఈ చిత్రంలోని పాత్రలు కేవలం రాజకీయ నాయకులను అనుకరించారని కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదని అంటున్నారు.

దీంతో ఇప్పటికే ఈ చిత్రానికి పలు చోట్ల నెగిటివ్ టాక్ వచ్చింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube