అందుకోసం అరగంటలో ముప్పై కేజీల ఆరంజ్ లు తిన్న వ్యక్తి..!

సాధారణంగా విమానంలో ప్రయాణం చేయకూడదని కొన్ని పదార్థాలను తీసుకొని వెళ్ళకూడదని, కొంచం మోతాదులోనే తీసుకెళ్లాలని, అలాగే హానికరమైన పదార్థాలను తీసుకెళ్లకూడదు అంటూ పలు నిబంధనలు ఉండడం సహజమే.అలగే ఏ ప్రయాణికుడికైనా లగేజ్ ఎక్కువగా ఉన్న సమయంలో విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చు ఆ పాసింజర్ పే చేయలేనంత  ఖర్చు ఉంటాయి.

 That Is Why A Person Who Ate Thirty Kilos Of Oranges In Half An Houroranges, Chi-TeluguStop.com

అచ్చం అలంటి సంఘటనే  ఒక పాసింజర్ కు సమస్య ఎదురైంది.ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నారన్న సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఎవరూ చేయని పని వారు చేసి ఒక్క సరిగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల లోకి వెళ్తే.

Telugu Mins, Kg, Airport, China, Oranges, Latest-Latest News - Telugu

చైనా యునాన్ ప్రావిన్స్​ లోని కున్మింగ్ ఎయిర్​ పోర్టు లో ఒక నలుగురు స్నేహితులు కలిసి బిజినెస్ ట్రిప్ మీద విమాన ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు.వారికీ 50 యువాన్లకే 30 కేజీల ఆరెంజ్ పండ్లు వచ్చే సరికి వారు వాటిని కొనుగోలు చేసి వారితో పాటు తీసుకొని వెళ్లాలని అనుకున్నారు.కానీ, విమాన ప్రయాణం చేసేందుకు ఎయిర్ పోర్ట్ కు వచ్చిన వారికి సిబ్బంది షాక్ ఇచ్చింది.వారితో పాటు 30 కేజీల ఆరెంజ్ పండ్లను తీసుకొని వెళ్ళాలి అంటే 300 యువాన్ల లగేజ్ ఛార్జి చెల్లించాలని వారికి ఎయిర్ పోర్ట్ సిబ్బంది తెలిపింది.
.

దీనితో ఆ నలుగురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు.ఆరెంజ్ పండ్లను వేస్ట్ చేయకుండా,  లాగే అంత పెద్ద మొత్తంలో ఛార్జ్ చెల్లించకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు.ఇంతకీ వాళ్ళు ఏం చేశారు అని అనుకుంటున్నారా ? ఆ నలుగురు కలిసి 30 నిమిషాల్లోనే 30 కేజీల ఆరెంజ్ పండ్లను తినేశారు.ఈ సంఘటన చూసిన వారందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యారు.ఎయిర్ పోర్ట్ ఆవరణం లోనే  అంత మొత్తంలో అన్ని పండ్లను  తినడం చూసి చాలామందికి ఆశ్చర్యం వేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube