ఈ స్టార్ హీరోయిన్ అందుకే పెళ్లి చేసుకోలేదంట…  

That Is The Reason Why Telugu Veteran Actress Nagma Is Not Married - Telugu Cricketer, Ganguly, Marriage News, Nagma, Telugu Veteran Actress, Tollywood

తెలుగులో ఒకప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, తదితర స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందినటువంటి సీనియర్ నటి నగ్మా గురించి తెలియని వారుండరు.అయితే ఈమె ఒక తెలుగులోనేగాక కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, భాషల్లో కూడా నటించి తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

 That Is The Reason Why Telugu Veteran Actress Nagma Is Not Married

కాగా 1990 సంవత్సరంలో సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి నగ్మా 2009 వరకు తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించింది.

అయితే ప్రస్తుతం నటి నగ్మా కి దాదాపుగా 48 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు నగ్మా ఎందుకు పెళ్ళి చేసుకోలేదని విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

ఈ స్టార్ హీరోయిన్ అందుకే పెళ్లి చేసుకోలేదంట…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో ఎక్కువగా కోలీవుడ్ కి చెందినటువంటి ఓ స్టార్ హీరో మరియు నగ్మా అప్పట్లో గాఢంగా ప్రేమించుకున్నారని, కానీ ఆ కోలీవుడ్ హీరో మాత్రం అప్పటికే సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న టువంటి మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడని పలువురు బలంగా చర్చించుకుంటున్నారు.అయితే ఈ ప్రేమ పెటాకులైన తర్వాత నగ్మా ప్రముఖ భారత క్రికెటర్ గంగూలీతో కూడా కొన్ని రోజులు ప్రేమాయణం నడిపిందని చివరికి ఆ ప్రేమ కూడా విఫలం అవడంతో నగ్మా కి పెళ్లి అనే వైవాహిక  బంధంపై విరక్తి చెంది ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదట.

అయితే సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత నగ్మా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తోంది.అయితే అప్పటి తరం ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల చిత్రాల్లోప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నప్పటికీ  నగ్మా మాత్రం చిత్ర పరిశ్రమ వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

That Is The Reason Why Telugu Veteran Actress Nagma Is Not Married Related Telugu News,Photos/Pics,Images..

footer-test