తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు “కొరటాల శివ” దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.
అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన టాలీవుడ్ చందమామ “కాజల్ అగర్వాల్” హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు కన్నడ బ్యూటీ “రష్మిక మందాన” గెస్ట్ పాత్రలో కనిపించనున్నారు.
అయితే తాజాగా మెగా స్టార్ చిరంజీవి కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో కలకలం రేపుతోంది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా ఇతర భాషలలో విజయం సాధించిన చిత్రాల రీమేక్ పై ఆధార పడుతున్నారని కొందరు దర్శక నిర్మాతలు చర్చించుకుంటున్నారు.
అంతేగాక గతంలో తమిళంలో మంచి విజయం సాధించిన “ఖైదీ150” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టినప్పటికీ ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన “సైరా నరసింహారెడ్డి” చిత్రంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు.అందువల్లనే మరింత కాలం పాటు ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయకుండా రీమేక్ లపై దృష్టి సారించినట్లు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే మలయాళం భాషలో ప్రముఖ హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన “లూసిఫర్” అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ చిత్రానికి దర్శకుడిగా టాలీవుడ్ దర్శకుడు ఎంపిక చేసినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల సుజిత్ తప్పుకున్నాడు. దీంతో మరోమారు మెగాస్టార్ తన చిత్రం కోసం దర్శకుడి వేటలో పడ్డాడు.
మరి మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించే అదృష్టం ఏ దర్శకుడికి దక్కుతుందో చూడాలి.