ఆ కారణంగానే జగన్ ను వదిలేస్తున్నా లేదంటే అంటూ ఆర్జీవి కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సి దర్శకుడు ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. కాంట్రవర్సిలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పవచ్చు.

 This Is The Reason Why I Leaving Jagan Rgv Comments Viral Details,  Rgv, Tollywo-TeluguStop.com

ఆయన తీసే సినిమాలతో పాటు, సోషల్ మీడియాలో అతను చేసే ట్వీట్ లు కూడా తీవ్ర దుమారం రేపుతుంటాయి.సోషల్ మీడియాలో ఎప్పుడు వివాదాస్పద వాఖ్యలు చేస్తూ వ్యంగ్య కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు

ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ మేరకు వర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఆర్జీవి మిస్సింగ్ అనే సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల పొలిటిషియన్స్ ను టార్గెట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా టిడిపి, జనసేన పార్టీలకు ఆగ్రహం తెప్పించే విధంగా ఉంటుంది అంటున్నారు.

ఈ క్రమంలోనే అందరినీ టార్గెట్ చేసిన వర్మ జగన్ పై మాత్రమే ఎందుకు వేయడం లేదు? జగన్ అంటే అభిమానమా? లేక భయమా?అన్న ప్రశ్నలు వేస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Jagan, Ram Gopal Varma, Rgv, Tollywood, Tweet-Movie

ఈ విషయంపై స్పందించిన వర్మ జగన్ ప్రవర్తన, మాట్లాడే విధానం, వ్యవహారశైలి బలంగా ఉంటాయి.జగన్ పై కామెడీ స్పూఫ్ లకు ఆస్కారం ఉండదు, అందువల్లే జగన్ వ్యక్తిత్వం స్పూఫ్ లు చెయ్యను, ఈ కారణంగానే తప్ప జగన్ పట్ల తనకు ప్రత్యేక అభిమానం లేదు అంటూ రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.అనంతరం చంద్రబాబు, జగన్ ఫోటోలు షేర్ చేస్తూ జగన్ రియల్ లీడర్, చంద్రబాబు రీల్ లీడర్ అని ట్యాగ్ చేశారు.

ఈ విషయంపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube