జ‌ల వివాదంపై చంద్ర‌బాబు మౌనానికి కార‌ణం అదేనంట‌..!

తెలుగు రాష్ట్రాల న‌డుమ ఇప్పుడు జ‌ల వివాదం ఏ స్థాయిలో జ‌రుగుతుందో చూస్తూనే ఉన్నాం.పార్టీల‌ నుంచి వ్య‌క్తుల మ‌ధ్య వివాదాన్ని లేపే దాకా వెళ్తోంది.

 That Is The Reason For Chandrababu Silence On Water Dispute, Chandrababu,  Ycp,-TeluguStop.com

మ‌రి ఇంత‌టి వివాదం జ‌రుగుతున్నా కూడా ఓ కీల‌క నేత మాత్రం దీనిపై నోరు మెద‌ప‌ట్లేదు.మొద‌టి నుంచి ఇలాంటి వివాదాల‌ను ఎదుర్కొన్న నేత వీటన్నింటితో సంబంధం ఉన్న ఆయ‌న మాత్రం మౌనంగా ఉండ‌టంతో అధికార పార్టీ రెచ్చిపోయి మ‌రీ ఆయ‌న్ను టార్గెట్ చేస్తోది.

ఆయ‌నెవ‌రో కాదు మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.

అయితే ఆయ‌న సైలెంట్‌గా ఉంటూ వైసీపీకి అంత‌గా విమ‌ర్శించేందుకు ఆరోప‌న‌లు చేసేందుకు అవ‌కాశం ఎందుకు ఇస్తున్నారో ఎవ‌రీకీ అంతు చిక్కకుండా ఉంది.

అస‌లు ఈ వివాదాన్ని ఆయ‌న అడ్వాంటేజ్‌గా మార్చుకోవ‌చ్చు క‌దా ఇలాం ఎందుకు చేస్తున్నారంటూ ఎప్ప‌టి నుంచో తెలుగు త‌మ్ముళ్ల‌లోనే ఇలాంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి.మ‌రి చంద్రబాబు సైలెంట్ గా ఉండటానికి అస‌లు కార‌ణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది.

Telugu Andhra Pradesh, Chandrababu, Jagan, Krishna River, Telangana, Telugu-Telu

త‌న హ‌యాంలోనే ఇరు రాష్ట్రాల సీఎం లు అలాగే ఇరిగేషన్ ఆఫీస‌ర‌ర్లు కూల్‌గా మాట్లాడుకొని ఎలాంటి వివాదాలు రాకుండా ఒప్పందం చేసుకున్నారు కాబ‌ట్టే ఘ‌ర్ష‌న వాతావ‌ర‌ణం రాలేద‌ని, కానీ ఇప్పుడు ఉన్న కేసీఆర్‌, జ‌గ‌న్ మధ్య సఖ్యత బాగేనే ఉంది కానీ వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల మేరకు తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య వివాదం రాజేస్తున్న‌ట్టు టీడీపీ ఆరోపిస్తోంది.ఇంకోవైపు ఈ వివాదాన్ని కాస్తా కేంద్రం చేతిలో పెట్ట‌డంతో దీనిపై అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మాట్లాడాల‌ని, ఇప్పుడు మాట్లాడితే వైసీపీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారంట‌.అందుకే దీనిపై వైసీపీ ఏదైనా స్టెప్ తీసుకుంటే ఆ త‌ర్వాత మాట్లాడుదామ‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.మ‌రి వైసీపీ కూడా ఇప్పుడు కేంద్రంపై విమ‌ర్శ‌లు మొద‌లు పెట్ట‌డంతో ఆయ‌న ఏదైనా స్పందిస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube