దటీజ్ కమలా హారిస్..!!  

కమలా హరీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన విషయం తెలిసిందే.అంతకు ముందు కమలా హరీస్ అధ్యక్ష పదవికి పోటీ పడినా బిడెన్ కే ఆ ఛాన్స్ దక్కింది.

TeluguStop.com - That Is Kamala Harris Kamala Harries Drawing The Boy Telar

ఇక బిడెన్ ఎంతో మంది మేధావులు ఉపాధ్యక్ష రేసులో ఉన్నా అందరిని పక్కన పెట్టి కమలా హరీస్ కు కీలకమైన పదవి కట్టబెట్టారు.అందుకు రీజన్ ఏంటి.

కమలా హరీస్ అంటే అమెరికాలో అంత క్రేజ్ ఏంటి అంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయి.ఆమె సింపిల్ సిటీ, సామాన్య ప్రజలపై ఆమె చూపించే ఎలలేని ప్రేమే నేడు కమలా హరీస్ ను ఎంతో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాయి.

TeluguStop.com - దటీజ్ కమలా హారిస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా జరిగిన ఓ సంఘటన మరో సారి కమలా హరీస్ ఉన్నత వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.

అమెరికాలోని బే ఏరియా కు చెందిన టేలర్ అనే వ్యక్తి కమలా హరీస్ ఫోటో ను చేతులతో గీసి అందరిని ఆశ్చర్య పరిచాడు.

ఈ వీడియోను అతడు ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది కాస్తా అమెరికా వ్యాప్తంగా వైరల్ అయ్యింది.అతడి టాలెంట్ కి నెటిజన్లు ఫిదా అయ్యారు.అయితే ఈ వీడియో కమలా హరీస్ కు చేరేలా షేర్ చేయాలనీ కోరాడు.దాంతో వందలాది షేర్ లు అవ్వగా ఎంతో మంది కమలా హరీస్ ను ట్యాగ్ చేసి షేర్ చేశారు.

హిల్లరీ క్లింటన్ కుమార్తె కూడా ఈ వీడియో కమలా కి ట్యాగ్ చేసి షేర్ చేయాడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.దాంతో

ఎట్టకేలకు ఈ వీడియో ని చూసిన కమలా హరీస్ అతడి ఫోన్ నెంబర్ కనుక్కుని మరీ అతడికి ఫోన్ చేశారు.టైలర్ నువ్వు ఎంతో అద్భుతంగా నా బొమ్మ గీశావ్, నాకు ఎంతో బాగా నచ్చింది, నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను, ఇది నాకు ఎంతో ప్రత్యేకమైనది అంటూ టైలర్ తో మాట్లాడే సరికి అతడి నోట వెంట మాట రాలేదట.నా లాంటి సాధారణ వ్యక్తికీ కమలా హరీస్ ఫోన్ చేసి మాట్లాడటం ఆమె గొప్పతనానికి నిదర్శనం అంటూ టైలర్ మరో ట్వీట్ చేస్తూ హిల్లరీ కుమార్తె కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.

#KamalaHarris #KamalaHarries #ThatIs #Telar #The Boy Telar

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు