ప్రభాస్ కు 'డార్లింగ్' అనే పేరు అలా వచ్చిందట!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ ఏ రేంజ్ కు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయాడు.

 That Is How The Name Darling Came To Prabhas Details, Prabhas,tollywood,actor, L-TeluguStop.com

ప్రభాస్ రెబల్ స్టార్ కృష్ణం రాజు నటవారసుడిగా వెండితెరకు సులువుగానే పరిచయం అయినా ఆ తర్వాత విజయాలు లేకపోవడంతో నిరాశ చెందాడు.కానీ ప్రభాస్ ఒకానొక సమయంలో చేసిన వర్షం సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.

ఇక రాజమౌళి తో చేసిన ఛత్రపతి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగి పోయాడు ప్రభాస్.ఇక బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ను డార్లింగ్ అని ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు.ఇక ప్రభాస్ కూడా తోటి నటులను డార్లింగ్ అనే పిలుస్తారు.

కానీ ఆ పదం ఇండస్ట్రీలో ఎలా పుట్టింది? ఎందుకు ప్రభాస్ ను డార్లింగ్ అని పిలుస్తారో తెలుసా.?

ఇక డార్లింగ్ అనే పదం ఎలా పుట్టిందో దాని గురించి ప్రభాస్ ను ప్రశ్నించగా ఆయన గతంలోకి వెళ్లారు.

Telugu Salaar, Aadi Purush, Bujjigadu, Puri Jagannath, Latest, Prabhas, Project,

బుజ్జిగాడు సినిమా సమయంలోనే పూరి ని తాను చాలా ప్రేమిస్తున్నాని.అతన్ని డార్లింగ్ అని పిలిచే వాడినని ప్రభాస్ చెప్పాడు.అదే సమయంలో ఆ పిలుపు నచ్చి బుజ్జిగాడు సినిమాలో ఉపయోగించాడు.ఈ సినిమాలో ప్రభాస్ ప్రతి ఒక్కరిని డార్లింగ్ అనే పిలిపించాడు పూరీ.

Telugu Salaar, Aadi Purush, Bujjigadu, Puri Jagannath, Latest, Prabhas, Project,

ఇక అప్పటి నుండి ఇండస్ట్రీ వారు కూడా ప్రభాస్ ను డార్లింగ్ అనే పిలుస్తున్నారు.ఈ పదం అక్కడి నుండి పుట్టిందని ప్రభాస్ తెలిపారు.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను చేస్తున్నాడు.ఇక సందీప్ వంగ సినిమాలో స్పిరిట్ సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాలు అనౌన్స్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube