థైరాయిడ్‌ వల్ల పెరిగే బరువును తగ్గించాలా.? అయితే ఈ 5 టిప్స్ తప్పక పాటించండి.!

పి.సి.ఓ.డి, థైరాయిడ్‌… ఈ రెండూ జీవక్రియను చాలా ప్రభావితం చేస్తాయి.రిజల్ట్‌ ఏమిటంటే, అధికబరువు, ఋతుస్రావం క్రమం తప్పడం, బద్ధకం, ఒళ్ళు బరువుగా ఉండడం, జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం, మలబద్ధకం, అతిగా నిద్ర, నీరసం, ఆకలి… ఇలా పలు రకాల సమస్యలు వస్తుంటాయి.

మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1.మంచినీళ్ళు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.ఉదాహరణకు: మజ్జిగ, పండ్ల రసాలు, సూప్‌లు, రసం లాంటివి.
2.పీచు పదార్థం ఉన్న ఆహారాలు ప్రతి పూటా తీసుకోవాలి.

ఉదాహరణకు: పళ్ళు, కాయగూరలు, ముఖ్యంగా క్యాప్సికమ్‌, తొక్క తీయని గింజలు, చిరుధాన్యాలు.
దీని వల్ల శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది.మలబద్ధకం పోతుంది.
3.మీ ప్లేట్‌లో సగానికి సగం పళ్ళు, కాయగూరలతో నిండి ఉండాలి.దీనివల్ల ఆకలితో పాటు బరువు కూడా క్రమేపీ తగ్గుతుంది.
4.హార్మోన్‌ బ్యాలెన్స్‌ ఉండాలంటే మాంసకృత్తులు చాలా ముఖ్యం.పప్పు దినుసుల్లో, గుడ్డులో ప్రోటీన్లు ఉంటాయి.వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.5.ప్రతిరోజూ వ్యాయామం చెయ్యాలి.ఇది హార్ట్‌బీట్‌ రేటును పెంచేదిగా ఉండాలి.

థైరాయిడ్‌ ఉన్నప్పుడు ఒంట్లో రక్తం శాతం తగ్గే అవకాశం ఉంది.అలాగే క్యాల్షియం కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంది.దీనితో పాటు కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంది.

ఖర్జూరాలు, ఆకుకూరలు, హోల్‌ ఎగ్‌లో రక్తశాతం పెంచే ఖనిజాలు ఉంటాయి.పాలు, పాల ఉత్పత్తుల్లో క్యాల్షియం ఉంటుంది.

వీటిని ఒక భాగం మీ ఆహరంలో తీసుకోవాలి.పీచు పదార్థం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

కాబట్టి, ఏదో విధంగా బరువు తగ్గడం కన్నా మనకున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని, తగిన ప్రణాళికను ఎంచుకోవాలి.తద్వారా ఆరోగ్య సమస్యలు, అధిక బరువు నుంచి బయటపడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube