ఆ హెడ్మాస్టర్ కోపం పిల్లాడికి శాపంగా మారింది....!

నిజామాబాద్ రూరల్ గుండారం గ్రామం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో దారుణం జరిగింది.ప్రధానోపాధ్యాయుడు కారణంగా నాలుగో తరగతి విద్యార్థి అనీస్ మృతిచెందాడు.

 That Headmaster's Anger Became A Curse For The Child...!-TeluguStop.com

ఈనెల 22 న అనీస్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు కొన్ని పత్రాలు ఇచ్చి బయటకు వెళ్లి జిరాక్స్‌ తీసుకురావాలని పురమాయించాడు.అనీస్‌ జిరాక్స్ తీసుకొని తిరిగి రావడం లేట్ అయిందంటూ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసి, తన రెండు చెవులు పట్టుకొని మీదకి ఎత్తి పడేశాడు.

అంతటితో ఊరుకోక ప్రధానోపాధ్యాయుడు ఆ విద్యార్థిని కర్ర పట్టుకుని తరముగా అనీష్ అక్కడున్న వరండా పైనుంచి జారిపడ్డాడు.దీంతో తీవ్ర గాయాలపాలైన అనీస్ అక్కడికక్కడే మృతి చెందాడు.

చిన్నారి మృతితో కన్నవారు గుండెలవిసేలా రోదిస్తుంటే, ఆ పసి ప్రాణానికి ఆ గ్రామ పెద్దలు లక్ష రూపాయలు వెలకట్టి చేతులు దులుపుకొన్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube