మామూలుగా మనం మనీ పర్స్ ఎంత పెట్టి కొంటాము చెప్పండి.మహా అయితే.
వెయ్యి లేదా రెండు వేలు వరకు కొంటూ ఉంటాం.ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్న వాడైతే పదివేల వరకు కొంటారేమో.
అయితే, తాజాగా హ్యాండ్ బ్యాగ్ లో ఎలాంటి వస్తువులు, నగలు, డబ్బులు లేకపోయినా సరే కేవలం ఆ హ్యాండ్ బ్యాగ్ కొట్టేస్తే చాలు అతడు కోటీశ్వరుడు అయిపోతాడు.దీనికి కారణం ఆ హ్యాండ్ బ్యాగ్ ధర ఏకంగా 52 కోట్ల రూపాయలు కావడమే.
అవునండి బాబు.మీరు చదివింది నిజంగా నిజమే.
ఒక హ్యాండ్ బ్యాగ్ కు ఇంత ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తున్నారా.? అయితే ఇందుకు సంబంధించి పూర్తి ప్రత్యేకతలను మీరు తెలుసుకోవాల్సిందే.
లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ లను రూపొందించే ఇటలీ దేశానికి చెందిన బోరిని మిలానేసి అనే సంస్థ హ్యాండ్ బ్యాగ్ రూపొందించింది.బొలాంగా బ్రాండ్ కు చెందిన హ్యాండ్ బ్యాగ్ ను పర్వామియా అని పిలుస్తారు.
అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ లు ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ఒక్కో హ్యాండ్ బ్యాగ్ కోసం ఏకంగా 1000 గంటలపాటు సమయాన్ని వెచ్చిస్తారు.తాజాగా ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన హ్యాండ్ బ్యాగ్ బోరిని అంటే మిలాన్ ఈ సంస్థ ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసింది.
52 కోట్ల విలువ చేసే ఈ హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేసేందుకు ఎంతగానో గర్వంగా ఉందని ఇంత ధర కలిగిన హ్యాండ్ బ్యాగ్ తయారు చేయడం వెనుక చాలా మంచి ఉద్దేశ్యం ఉందని కంపెనీ చెప్పుకొచ్చింది.దీని వెనుక దాగి ఉన్న అసలు విషయాన్ని తెలుపుతూ.ప్రపంచంలో సముద్రాలను కాపాడాలి అనే అంశం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాము ఈ బ్యాగ్ ను విడుదల చేశారు అంటూ చెప్పుకొచ్చింది.
ఈ హ్యాండ్ బ్యాగ్ ను విడుదల చేయడం ఆ తర్వాత వచ్చిన సొమ్ములో సగం డబ్బులు సముద్రాలను శుభ్రం చేసేందుకు చేపట్టే పనులకు ఉపయోగించబోతున్నట్లు కంపెనీ తెలియజేసింది.