ఐపీఎల్ 2022: సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఆ మాజీ స్పీడ్‌స్టర్‌ ఎంపిక..!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈసారి మంచి జట్టుతో ఐపీఎల్ 2022 సీజన్ లో విజయకేతనం ఎగురవేయాలని యోచిస్తోంది.ఆ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 That Former Speedster Was Selected As The Sunrisers' Bowling Coach Ipl2022, Sunr-TeluguStop.com

ప్రస్తుతానికి విలువైన సలహాలను అందించే కోచింగ్‌ సిబ్బంది ఎంపిక విషయంలో సన్‌రైజర్స్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది.ఎవరిని ఎంచుకుంటే జట్టుకు ఎక్కువ లాభం చేకూరనుందనే విషయంలో సమాలోచనలు చేస్తోంది.

అయితే తాజా నివేదికల ప్రకారం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా స్పీడ్‌ స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈసారి కూడా కోచ్‌గా టామ్‌ మూడి కొనసాగనున్నారని విశ్వసనీయ సమాచారం.

ఇక బ్యాటింగ్‌ సలహాదారుగా హేమంగ్‌ బదానీని నియమించుకోవాలని సన్‌రైజర్స్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

Telugu Coach, Dale Stayen, Ipl, Upadte-Latest News - Telugu

ఐపీఎల్ 2016లో కప్ సొంతం చేసుకున్న సన్‌రైజర్స్‌ జట్టు గత రెండు సీజన్లలో పేలవమైన ప్రదర్శనతో బాగా చతికిలపడింది.కానీ ఈసారి టాలెంటెడ్ ఆటగాళ్లతో మంచి ప్రదర్శన చూపించాలని దృఢంగా నిశ్చయించుకుంది.అందుకే రెండో ఆలోచన లేకుండా కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ను కూడా వదిలేసింది.

స్టార్‌ స్పిన్నర్‌ రషీద్ ఖాన్‌ ను అట్టి పెట్టుకోవాలని భావించింది కానీ అది సాధ్యం కాలేదు.ఐతే రిటెన్షన్ ప్రక్రియలో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, మరో ఇద్దరు యువ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది.

డేల్‌ స్టెయిన్‌ను బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసుకున్నట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ త్వరలోనే ప్రకటించొచ్చు.సత్తాగల ఓపెనర్లు, టాలెంటెడ్ మిడిలార్డర్‌, ప్రతిభగల బౌలర్లను ఎంపిక చేసుకోవడం ద్వారా సన్‌రైజర్స్‌ బలమైన జట్టుగా తయారయ్యే అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు మంచి ఆటగాళ్లను ఇతర ఫ్రాంచైజీలు కూడా ఎత్తుకెళ్లిపోయేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.కొత్త జట్లు కూడా జిమ్మిక్కులు ప్లే చేస్తూ స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు మెగా వేలం ముందే ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చక్కటి ప్లేయర్లు దొరకడం కాస్త కష్టమే.మెగా వేలంలో హైదరాబాద్ జట్టు ఎవరిని ఎంచుకుంటుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube