ఆ చేప వయసు అక్షరాలా వందేళ్లు!

కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని మత్స్యకారులు ఇటీవల పది అడుగుల కంటే ఎక్కువ పొడవు, కనీసం 100 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ చేపను పట్టుకున్నారు.ఫేస్‌బుక్‌లో దానిని పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

 That Fish Is Literally Hundreds Of Years Old , Fish , 100 Years, Viral Latest,-TeluguStop.com

మత్స్యకారులు స్టీవ్ ఎక్‌లండ్, మార్క్ బోయిస్ లిలూయెట్ సమీపంలో ఫిషింగ్ ట్రిప్‌కు వెళ్లారు.అక్కడ వారు పెద్ద చేపలను పట్టుకున్నారు.

అయితే వారికి వైట్ స్టర్జన్‌ అనే చేప దొరికింది.అది ఏకంగా 10 అడుగుల పొడవు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.57 అంగుళాల చుట్టుకొలత ఉంది.తమ చరిత్రలో దొరికిన అతి పెద్ద చేపగా దానిని అభివర్ణించారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu Canada, Fish, Fishliterally, Fishermen, Markboyce, Steve Eckland, Latest,

సముద్ర జీవితం చాలా ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది.ఎందుకంటే మనకు ఇంకా తెలియనివి చాలా ఉన్నాయి.కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని ఒక మత్స్యకారుడు ఇటీవల పది అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉండే అపారమైన తెల్లటి స్టర్జన్‌ను పట్టుకున్నాడు.

వారు పట్టుకున్న చేప బరువు 700 పౌండ్లు ఉంటుంది.కిలోలలో చెప్పాలంటే 317 కిలోలు.దానికి పడవలోకి ఎక్కించడానికే ఏకంగా రెండు గంటల సమయం పట్టింది.వైట్ స్టర్జన్ చేపలు ఉత్తర అమెరికాలో అతిపెద్ద మంచినీటి చేపగా నిపుణులు చెబుతుంటారు.

ఇవి 14 అడుగుల పొడవు, 680 కిలోల వరకు బరువు ఉంటుంది.ఫ్రేజర్ రివర్ స్టర్జన్ కన్జర్వేషన్ సొసైటీ ప్రకారం, వైట్ స్టర్జన్‌లు 150 సంవత్సరాలకు పైగా జీవించగలవు.

అయితే తమ వలలో పడిన చేపలను ఎవరూ వదిలి పెట్టరు.అయితే వీరు మాత్రం ఆ అరుదైన చేపతో ఫొటో దిగారు.

ఆ తర్వాత తిరిగి ఆ వందేళ్ల వయసు ఉన్న చేపను తిరిగి నీళ్లలోకి విడిచి పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube