అక్కడ పొలంలో పని చేయాలంటే హెల్మెట్ ఉండాల్సిందే ! ఎందుకంటే...?

బైకులు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని ప్రభుత్వం పదే పదే ప్రచారం చేస్తుంది.బండి మీద వెళ్లేవారు హెల్మెట్ ధరించకపోతే ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ఊహించని సంఘటన జరగవచ్చని అభిప్రాయంతో ప్రభుత్వం ఈ విధంగా చేస్తోంది.

 That Farmers Use Helmets At Agriculture Land-TeluguStop.com

హెల్మెట్ ధరించిన వారిని పెనాల్టీ కూడా విధిస్తోంది.ఇదంతా సాధారణంగా జరుగుతూనే కానీ ఉంది.

కానీ ఇప్పుడు ఈ హెల్మెట్లు పెట్టుకుని పొలం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి కొంతమంది రైతులకు తప్పనిసరైంది.ఇది వినడానికి చూడడానికి వింతగా ఉన్న ఇదంతా నిజం.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది.ఈ గ్రామాల శివారులో ఓ ప్రైవేటు గ్రానైట్‌ క్వారీ నడుస్తోంది.పెద్ద పెద్ద బండరాళ్లను తొలిచేందుకు క్వారీ నిర్వాహకులు పేలుళ్లకు పాల్పడుతున్నారు.ఆ పెలుళ్ల ధాటికి.రాళ్లు వచ్చి పక్కనున్న గ్రామాలు, పొలాల్లో పడుతున్నాయి.దీంతో ఎప్పుడు ఎక్కడి నుంచి రాళ్లు పడతాయో తెలియక.

హెల్మెట్లు పెట్టుకుని పనిచేయాల్సి వస్తోంది.క్వారీ నుంచి వచ్చే దుమ్మును, శబ్ధాలను, రాళ్లను ఎదుర్కొనేందుకు.

ఆత్మరక్షణ కోసం హెల్మెట్లు ధరిస్తున్నామని.రైతులు చెబుతున్నారు.

ఈ క్వారీ వల్ల చాలామంది పొలాలను అమ్ముకోవాల్సి వచ్చిందని.స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో క్వారీ నడుస్తుందని.

రైతులు ఆరోపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube